Begin typing your search above and press return to search.

ఏపీలో బీజేపీ... బాబుపై నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు!

అవును.. బీజేపీ, మోడీ వైఖరిపై అవకాశం వచ్చినప్పుడల్లా విరుచుకుపడే సీపీఐ నారాయణ తాజాగా మరోమారు స్పందించారు.

By:  Tupaki Desk   |   8 July 2024 7:31 AM GMT
ఏపీలో బీజేపీ... బాబుపై నారాయణ ఆసక్తికర  వ్యాఖ్యలు!
X

ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ - జనసేన కలిసి బీజేపీతో జతకట్టడంపై మొదటి నుంచీ సీరియస్ గా రియాక్ట్ అవుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి.. చంద్రబాబు చేసిన పనివల్ల ఏపీలో బీజేపీకి మంచి జరిగిందని.. 2019లో ఒక్క సీటూ గెలవని వారు ఈ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాలు గెలుచుకున్నారని ఫైర్ అయ్యారు!

అవును.. బీజేపీ, మోడీ వైఖరిపై అవకాశం వచ్చినప్పుడల్లా విరుచుకుపడే సీపీఐ నారాయణ తాజాగా మరోమారు స్పందించారు. ఇందులో భాగంగా... మోడీకి చింత చచ్చినా పులుపు చావలేదని, ఆయనకు ఇంకా అహంభావం పోలేదని అన్నారు. 400 సీట్లు వస్తాయని ప్రగల్భాలు పలికిన మోడీ 2019కంటే కూడా తక్కువ సీట్లే గెలుచుకున్నారని గుర్తుచేశారు.

ఈ సందర్భంగా బీహార్ సీఎం నితీష్ కుమార్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మద్దతుతోనే నేడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుందని.. వీరిద్దరూ ప్లేట్ ఫిరాయించకుండా మోడీ గట్టిగా పట్టుకున్నాడని.. ఎన్డీయేతో జతకట్టడం వల్ల ప్రమాదకరమైన బీజేపీని చంద్రబాబు రెండోసారి ఆంధ్ర రాష్ట్రానికి రప్పించాడని అన్నారు.

ఏది ఏమైనా... ప్రస్తుతం కేంద్రంలో ప్రభుత్వం చంద్రబాబు సహకారంతోనే నడుస్తుందనే విషయం గుర్తించి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం మోడీపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో... జగన్ ని ఓడించాలనే ప్రజలు చంద్రబాబుకు అధికారం అప్పగించారే తప్ప... బీజేపీ - జనసేన పార్టీలతో పొత్తువల్ల కాదని నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇదే క్రమంలో... ఏపీకి ప్రత్యేక హోదా కోసం సీపీఐ తప్పకుండా ఉద్యమం చేస్తుందని చెప్పిన నారాయణ... కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలకు కొంత సమయం ఇవ్వాలని వెల్లడించారు. కాగా... ఏపీలో బీజేపీతో టీడీపీ - జనసేన జతకట్టడం కమ్యునిస్టులకు ఏమాత్రం ఇష్టం లేని సంగతి తెలిసిందే! అవకాశం దక్కితే ఏపీలో బీజేపీ ప్లేస్ లో తాముండాలని కమ్యునిస్టులు భావించారని అంటుంటారు!