Begin typing your search above and press return to search.

కామ్రెడ్ ఇంత మాట అనేశాడేంటి బ్రో..!

ఏపీలో కామ్రెడ్స్ ఎప్పుడు ఎలాంటి ట‌ర్న్ తీసుకుంటారో చెప్ప‌డం క‌ష్టం. ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్య‌లు చేస్తారో కూడా చెప్ప‌లేం

By:  Tupaki Desk   |   1 Aug 2024 4:30 PM GMT
కామ్రెడ్ ఇంత మాట అనేశాడేంటి బ్రో..!
X

ఏపీలో కామ్రెడ్స్ ఎప్పుడు ఎలాంటి ట‌ర్న్ తీసుకుంటారో చెప్ప‌డం క‌ష్టం. ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్య‌లు చేస్తారో కూడా చెప్ప‌లేం. ఇప్పుడు కూడా అలాంటి వ్యాఖ్య‌లే చేశారు. ఎన్నిక‌ల‌కు ముందు వ‌రకు వైసీపీ కంటిపై నిద్ర లేకుండా చేసిన సీపీఐ పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ‌.. అనేక విమ‌ర్శ‌లు చేశారు. వైసీపీ ప్ర‌భుత్వం పోవాల్సిందేన‌ని అన్నారు. జ‌గ‌న్ కుప్ప‌కూలిపోవాల‌ని కూడా వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీ సంబ‌రాలు చేసుకుంది. ఇంకే ముంది మాకు ఒక మ‌నిషైనా క‌లిసొచ్చాడ‌ని అనుకుంది.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు అదే కామ్రెడ్ యూట‌ర్న్ తీసుకున్నారా? అనే లెక్క‌లో వ్యాఖ్య‌లు గుప్పిస్తున్నారు. తాజాగా రామకృష్ణ చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. వైసీపీ పాల‌న‌ను నేరుగా ఆయ‌న స‌మ‌ర్థించ‌క‌పోయినా.. నేరుగా ప్ర‌శంసించ‌క‌పోయినా.. కీల‌క వ్యాఖ్య‌లు చేసి.. టీడీపికి సెగ పెంచారు. చంద్ర‌బాబు అసెంబ్లీలో సూప‌ర్ సిక్స్ అంటే భ‌యం వేస్తోంద‌న్న వ్యాఖ్య‌ల‌కు రామ‌కృష్ణ కౌంట‌ర్ ఇచ్చారు.

వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీలు చెబుతున్న ప్ర‌కారం.. జ‌గ‌న్ పాల‌న‌పై విర‌క్తి పుట్టి, జ‌గ‌న్ అంటే అస‌హ్యం వేసి.. వైసీపీని గ‌ద్దెదించేశార‌నే క‌దా! అనేక అక్ర‌మాలు, అన్యాయాలు చేశార‌ని.. అందుకే జ‌గ‌న్‌ను దించేశార‌ని ఆయా పార్టీలు నాయ‌కులు కూడా చెప్పుకొచ్చారు. కానీ, తాజాగా క‌మ్యూనిస్టు రామ‌కృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``కూట‌మి అధికారంలోకి వ‌చ్చిందంటే.. మ‌రీ ముఖ్యంగా టీడీపీ అధికారంలోకి వ‌చ్చిందంటే.. దానికి కార‌ణం సూప‌ర్ -6`` అని నొక్కి వ‌క్కాణించారు.

ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఈ ప‌థ‌కాల‌ను అమ‌లు చేసేందుకు ఎందుకు వెన‌క్కి త‌గ్గుతు న్నార‌ని కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు. అంతేకాదు.. ఆయ‌నో చ‌క్క‌ని స‌ల‌హా కూడా ఇచ్చారు. మీరు అప్పులు చేస్తారో.. ఇంకేం చేస్తారో తెలియ‌దు.. మీపైనే ఆశ‌లు పెట్టుకునిసూప‌ర్ సిక్స్ చూసి ఓట్లేసి గెలిపించిన ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు వాటిని వెంట‌నే అమ‌లు చేయాల‌ని.. లేక పోతే.. ఉద్య‌మాలు త‌ప్ప‌వ‌ని ప్ర‌జ‌ల త‌ర‌ఫున తాము ఉద్య‌మిస్తామ‌ని కూడా చెప్పుకొచ్చారు. ఇదీ.. క‌మ్యూనిస్టు మాట‌!!