ప్రపంచాన్ని ఆకర్షించిన ఈ ఫన్నీ హోర్డింగ్.. అందులో ఏముందంటే?
అందుకే ఎంత క్రియేటివిటీ ఉంటే ఈ సమాజంలో అంత సక్సెస్ రేటు ఉంటుంది.
By: Tupaki Desk | 6 March 2025 8:42 PM ISTఅప్పట్లో మన అందరి దృష్టిని ఆకర్షించిన యాడ్ ఏదైనా ఉందంటే అది ‘హచ్’ టెలికాం సంస్థ రూపొందించిన ఒక వినూత్న కుక్క యాడ్. ‘వేర్ ఎవర్ యూ గో.. అవర్ నెట్ వర్క్ ఫాలోస్’ అంటూ ఓ మనిషిని అనుసరించే కుక్క యాడ్ ఇప్పటికీ అందరికీ గుర్తే.. ఇక ‘పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా?’ అనే క్రియేటివిటీ యాడ్ అయితే మరింత పాపులర్. అందుకే ఎంత క్రియేటివిటీ ఉంటే ఈ సమాజంలో అంత సక్సెస్ రేటు ఉంటుంది. తాజాగా ఓ హోర్డింగ్ ప్రకటన ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.. వైరల్ అవుతోంది.
మార్కెటింగ్ అనేది ఒక సృజనాత్మక ప్రక్రియ. మనం ఎంత విభిన్నంగా మార్కెటింగ్ చేయగలిగితే అంతగా జనాల్లోకి అది వెళుతుంది. క్రియేటివిటీతో చేసే ప్రకటనలు ప్రజల దృష్టిని ఆకర్షించడంలో ముందుంటాయి.
తాజాగా ఒక క్లినిక్ హోర్డింగ్‌పై ఉన్న సందేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. "జీవితంలో నిజం ఏమిటంటే, రోజూ శరీరంలో నుంచి ఏదో ఓ విధంగా బయటకు రావాల్సిందే. అలా రాకుంటే మా దగ్గరికి రండి!"
ఈ సందేశం చెన్నైలోని ASSANA అనే మలబద్ధక సమస్యలు , జీర్ణ సంబంధిత ఆరోగ్య కేంద్రం హోర్డింగ్‌పై రాయించి వినూత్నంగా ప్రదర్శించింది. ఇది రోడ్డుపక్కన అందరినీ ఆకర్షించింది. దీన్ని చూసినవారినే కాదు, సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిని ఆకర్షించింది. వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తోంది.
ప్రజలు దీనిని ఆస్వాదిస్తూ నవ్వుకుంటున్నారు. MBA కాలేజీలు కూడా దీన్ని ఆసక్తిగా గమనించాయి. మార్కెటింగ్, ప్రకటనల తరగతుల్లో ఇది ఒక కేస్ స్టడీగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు. .