గ్రామీణ మహిళకు క్రెడిట్ కార్డులు: బీజేపీ మేనిఫెస్టో
2 కోట్ల మంది సన్నకారు రైతులను న్యూట్రిషన్ ఆహార ఉత్పత్తుల సాగుకు ప్రోత్సహిస్తామన్నారు. వ్యవసా య ఉత్తత్తుల నిల్వకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
By: Tupaki Desk | 14 April 2024 6:29 AM GMTసార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. దీనిని స్వయంగా ప్రధాని మోడీ వెల్లడించారు. మహిళలను క్రీడా రంగంలో ప్రోత్సాహిస్తామని ప్రధాని తెలిపారు. సర్వైకల్ కేన్సర్ చికిత్సలు పెంచడం తోపాటు.. అవగాహన పెంచుతామని వివరించారు. గ్రామీణ ఆదాయం పెంచేలా.. పశుపోషణ, చేపల పెంపకం, అల్లికలు, కళలపై దృష్టి పెడతామని చెప్పారు. పశుపాలకులకు ప్రత్యేక రాయితీలు ఇవ్వను న్నట్టు ప్రధాని తెలిపారు. డెయిరీలను బలోపేతం చేస్తామని చెప్పారు. అన్న భండార్ యోజన కింద.. న్యూట్రిషన్ ఆధారిత ఆహారాన్ని ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. గ్రామీణ మహిళలకు క్రెడిట్ కార్డులు ఇస్తామని చెప్పారు.
2 కోట్ల మంది సన్నకారు రైతులను న్యూట్రిషన్ ఆహార ఉత్పత్తుల సాగుకు ప్రోత్సహిస్తామన్నారు. వ్యవసా య ఉత్తత్తుల నిల్వకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మోడీకీ ఖేతీ పేరుతో.. వ్యవసాయ క్షేత్రాలను విస్తరించనున్నట్టు తెలిపారు. ప్రకృతి వ్యవసాయానికి దోహద పడతామని చెప్పారు. నానో యూరియా వినియోగం పెంచేలా చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. కిసాన్ అభివృధ్ధి దేశ అభివృద్ది అని నమ్ముతున్నట్టు మోడీ పేర్కొన్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను విస్తరించనున్నట్టు తెలిపారు. తద్వారా ఉపాధి రంగానికి మరింత ఊతమిస్తా మన్నారు. జనజాతీయ(గిరిజనులు) వర్గానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వీరిని అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తామన్నారు. స్టార్టప్‌ల ద్వారా.. వీరిలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీస్తామని ప్రధాని వివరిం చారు. వికాస్-విరాసత్ మంత్రంతో బీజేపీ వచ్చే ఐదేళ్లలో గిరిజనులను ఆదుకుంటామన్నారు. సంత్ తిరువళ్లువర్ స్పూర్తితో ప్రాంతీయ భాషలను ప్రోత్సహిస్తామన్నారు.
తమిళ భాషను ఈ దేశానికి గర్వకారణమని పేర్కొన్న ప్రధాని.. ప్రాంతీయ భాషలను మరింత ప్రోత్సహిస్తా మని చెప్పారు. మూడు రూపాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్య మిస్తారు. సోషల్ ఇన్‌ఫ్ట్రా స్ట్రక్చర్, ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లను విస్తరిస్తామన్నారు. కామన్ సర్వీస్(మీ సేవ తరహా) సెంటర్‌లను విస్తరించనున్నట్టు తెలిపారు. అదేవిధంగా టెలీ మెడిసిన్‌ను విస్తరిస్తామని ప్రధాని పేర్కొన్నారు. ఈమూడు అంశాల్లోనే అనేక అంశాలు ఇమిడి ఉన్నాయని ప్రధాని తెలిపారు.