బ్రేకింగ్ : కేటీఆర్ పై క్రిమినల్ కేసు.. విషయం ఏంటంటే!
ఇలా వసూలు చేసిన మొత్తంలో రూ.2500 కోట్లను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు పంపించారంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 30 March 2024 6:44 AM GMTతెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమో దైంది. కాంగ్రెస్ పార్టీ చీఫ్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఇటీవల కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపైనే ఇప్పుడు క్రిమినల్ కేసు నమోదు కావడం గమనార్హం. అది కూడా కాంగ్రెస్ నేత చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే కేసు నమోదు చేయడం గమనార్హం.
ఏం జరిగింది..
కేటీఆర్.. ఇటీవల హనుమకొండలో పర్యటించారు. ఇక్కడ రైతులతో మాట్లాడారు. రైతులకు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకుండా సీఎం రేవంత్ ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇదే సమయం లో రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ మూడు మాసాల కాలంలో ఎంతో మందిని బెదిరించి సొమ్ములు వసూలు చేశారని చెప్పారు. ఇలా వసూలు చేసిన మొత్తంలో రూ.2500 కోట్లను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు పంపించారంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు డబ్బులు లేకపోవడంతో తెలంగాణలో దోచుకుంటున్నారని.. ఇక్కడ నుంచి వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్‌కు రేవంత్‌రెడ్డి దోచి పెడుతున్నా రని కేటీఆర్ ఆరోపించారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదురు దాడి వచ్చిన విషయం తెలిసిందే.
అయితే.. అంతటితో ఆగకుండా.. బత్తిన శ్రీనివాసరావు అనే కాంగ్రెస్ నాయకుడు.. హనుమకొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. అయితే.. రాష్ట్ర డీజీపీ సూచనల మేరకు.. ఈ కేసును నగరంలోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఐ పీ సీ 504,505(2) సెక్షన్ల కింద కేటీఆర్‌పై కేసు నమోదు చేసిన విషయాన్ని బంజారాహిల్స్ పోలీసులు ధ్రువీకరించారు.