Begin typing your search above and press return to search.

అంబానీని ప్ర‌శంసించిన‌వారే నేడు విమ‌ర్శిస్తున్నారే!

అంబానీ ఇంట పెళ్లి కుదురింది అంటే? నిరుపేద‌ల‌కు అన్న‌దానం చేయ‌డం అన్న‌ది ఎంతో కాలంగా చేస్తోంది అంబానీ కుటుంబం

By:  Tupaki Desk   |   12 July 2024 9:26 AM GMT
అంబానీని ప్ర‌శంసించిన‌వారే నేడు విమ‌ర్శిస్తున్నారే!
X

అంబానీ ఇంట పెళ్లి కుదురింది అంటే? నిరుపేద‌ల‌కు అన్న‌దానం చేయ‌డం అన్న‌ది ఎంతో కాలంగా చేస్తోంది అంబానీ కుటుంబం. స్వ‌యంగా వాళ్ల చేత‌లు మీదుగానే ఆ కార్య‌క్ర‌మం జ‌రుగుతుటుంది. ఖ‌రీదైన అన్ని ర‌కాల వంట‌కాలు వండించి స్వ‌యంగా వ‌డ్డిస్తారు. అన్న‌దానంలో ఎన‌లేని తృప్తిని అంబానీ ఫ్యామిలీ పొందుతుంది. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుక స‌మ‌యంలో జామ్ న‌గ‌ర్ లో కూడా పేద‌ల‌కు భారీ ఎత్తున అన్న‌దాన కార్య‌క్ర‌మం నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

అన్ని ర‌కాల వంట‌కాలు రుచి చూపించాల‌ని త‌న స్థాయికి ఏమాత్రం త‌గ్గ‌కుండా అన్న‌దానం చేసారు. ఈ పెళ్లి ఘ‌ట్టం మొద‌లైన నాటి నుంచి కూడా వివిధ ప్రాంతాల్ల ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది. ఇలా అన్న‌దానం చేసిన స‌మ‌యంలో నెటి జ‌నులంతా అంబానీ ద‌యాహృద‌యాన్ని ఎంత‌గానే మెచ్చుకున్నారు. గొప్ప వ్యాపార వేత్త నిరుపేద‌ల‌కు త‌న స్వ‌హ‌స్తాల‌తో వ‌డ్డించ‌డం అన్న‌ది ఎంతో గొప్ప విష‌యంగా నెటి జ‌నులు కీర్తించారు.

అయితే అదే నెటి జ‌నులు నేడు అంబానీని తీవ్ర స్థాయిలో విమర్శ‌లు గుప్పిస్తున్నారు. 5000 కోట్ల రూపాయ‌ల పెళ్లి ఖ‌ర్చు చూసి అంతా విస్తు పోతున్నారు. అంత‌కు ముందు దేశ , విదేశాల్లో నిర్వ‌హించిన ప్రీ వెడ్డింగ్ వేడుక‌లు చూసి అంతా నివ్వెర పోయారు. అయితే అంబానీ డ‌బ్బు ఉంద‌ని అంత డ‌బ్బు ఖ‌ర్చు పెట్టి చేయ‌డం అవ‌స‌ర‌మా? అని విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇంత ఖ‌ర్చు తో హ‌డావుడి అవ‌స‌ర‌మా? నిరాడంబ‌రంగా చేస్తే? ఆయ‌న స్థాయి త‌గ్గిపోతుందా? ఎందుకు అవ‌న‌స‌ర ఖ‌ర్చు అంటూ విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌రోవైపు ఇటీవ‌లే జీయో ఛార్జీలు కూడా భారీగా పెంచేసిన సంగ‌తి తెలిసిందే. వాటిని ఉద్దేశించి ప్ర‌జ‌ల మీద బాదేసి ఇన్ని వేల కోట్లు రూపాయ‌ల‌తో పెళ్లిళ్లు చేసుకుంటారా? 500 కోట్లు... 300 కోట్ల రూపాయ‌ల ఖ‌రీదు గ‌ల న‌గ‌లు ధ‌రిస్తారా? అంటూ సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ కూడా న‌డిచిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌శంసించిన వారే నేడు విమ‌ర్శించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.