చెత్తకుప్పలో పాతిక కోట్లు... ఒక క్లారిటీ వచ్చింది!
అవును... చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తికి బెంగళూరు చెత్తకుప్పలో రూ.25 కోట్ల విలువైన అమెరికన్ డాలర్లు కనిపించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 11 Nov 2023 3:46 AM GMTఈ నెల 3వ తేదీన బెంగళూరులోని నాగవర రైల్వేస్టేషన్ దగ్గర పట్టాల పక్కన... పశ్చిమ బెంగాల్ లోని నాడియాకు చెందిన సాల్మన్ అనే వ్యక్తి చెత్త సేకరిస్తుండగా ఓ బ్యాగు దొరికింది. దానిపై యునైటెడ్ నేషన్స్ అనే ముద్ర ఉంది. ఆ సంచిని అమృతహళ్లిలోని ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం దాన్ని తెరిచి చూస్తే.. అందులో 23 డాలర్ల కట్టలు కనిపించాయి. అయితే ఇప్పుడు అవి ఒరిజినలా నకిలీవా అన్నది తెరపైకి వచ్చింది.
అవును... చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తికి బెంగళూరు చెత్తకుప్పలో రూ.25 కోట్ల విలువైన అమెరికన్ డాలర్లు కనిపించిన సంగతి తెలిసిందే. దీంతో ఏం చేయాలో తెలియక గుజరీ వ్యాపారికి ఫోన్ లో ఈ విషయం చెప్పాడు. అయితే... తాను వేరే ఊరికి వెళ్లానని, బెంగళూరుకు వచ్చేవరకు మీ వద్ద పెట్టుకోవాలని సూచించాడు ఆ వ్యాపారి!
దీంతో బాగా భయపడ్డ సాల్మన్.. రెండురోజుల తర్వాత స్వరాజ్ ఇండియా సామాజిక కార్యకర్త కలీముల్లాను కలిసి విషయం చెప్పాడు. కలీముల్లా.. ఈ విషయం నగర పోలీస్ కమిషనర్ దయానందకు తెలిపారు. అనంతరం ఆ నగదును, సాల్మన్ ను తీసుకుని పోలీస్ కమిషనర్ ఆఫీసుకు వెళ్లి స్టేషన్ లో అప్పగించారు. ఇదే సమయంలో నగదు దొరికిన ప్రదేశాన్ని పోలీసులు తనిఖీ చేశారు.
ఈ సమయంలో తనిఖీ కోసం ఆ డాలర్లను సిటీలోని రిజర్వు బ్యాంకు బ్రాంచ్ కి పంపారు పోలీసులు. ఈ డబ్బు ఐక్యరాజ్యసమితి ఆర్థిక నేరాల విభాగానికి చెందినదై ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా అవన్నీ కనిలీ డాలర్లు అని తేలిందని చెబుతున్నారంట. నోట్లపై కొన్ని రసాయనాల పూతలు కూడా ఉన్నాయని అంటున్నారట.
ఇదే సమయంలో ఆ నోట్ల వెనుక ఉన్న కథ తెలుసుకోవడానికి చెన్నైలోని ఓ ప్రైవేటు బ్యాంకు తరలించినట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా... ఒక బ్యాగ్, అందులు 30 లక్షల డాలర్ కట్టలు, వాటి విలువ సుమారు 25 కోట్ల రూపాయలు అనే వ్యవహారం ప్రస్తుతానికి ఒక క్లారిటీ వచ్చినట్లు చెబుతున్నారు. అవన్నీ ఫేక్ అనేది ప్రైమరీ నివేదిక!!