భారీ వేలం.. అయినా నో ఇంట్రెస్ట్!
కీలకమైన 5జీ మొబైల్ సర్వీసులను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు టెలికాం కంపెనీలు ఈ స్పెక్ట్రమ్‌ను వినియోగించుకోనున్నాయని తెలుస్తోంది.
By: Tupaki Desk | 25 Jun 2024 7:40 AM GMTపదో విడత స్పెక్ట్రమ్ వేలం జూన్ 25 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం ఎనిమిది బ్యాండ్ల లో కేంద్ర ప్రభుత్వం ఈ వేలం నిర్వహిస్తోంది. రూ.96,317 కోట్ల విలువైన స్పెక్ట్రమ్ కోసం టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, భారతి ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ఈ వేలంలో పాల్గొనే అవకాశముంది.
అయితే గతంతో పోలిస్తే ఈసారి 5జీ స్పెక్రమ్ వేలంకు కంపెనీలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. వాటి దగ్గర ఇప్పటికే సరిపడా 5జీ బ్యాండ్లు ఉండటమే ఇందుకు కారణమని అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వానికి 2022తో పోలిస్తే ఈసారి కంపెనీలు చేసిన ముందస్తు డిపాజిట్ల మొత్తం తక్కువేనని తెలుస్తోంది. 2022లో జరిగిన వేలంతో పోలిస్తే ఈసారి కంపెనీలు 79–86 శాతం తక్కువగా ముందస్తు డిపాజిట్లు చేశాయని తెలుస్తోంది.
కాగా ఈసారి వేలం లో కూడా రిలయన్స్ జియో కీలకమైన బిడ్డర్ గా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. కీలకమైన 5జీ మొబైల్ సర్వీసులను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు టెలికాం కంపెనీలు ఈ స్పెక్ట్రమ్‌ను వినియోగించుకోనున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్ సర్వీసుల కోసం ఎనిమిది బ్యాండ్లలో వేలం వేయనున్న స్పెక్ట్ర మ్ బేస్ ధరను కేంద్ర ప్రభుత్వం రూ.96,317 కోట్లుగా ఖరారు చేసింది.
పదో విడత స్పెక్ట్రమ్ వేలంలో 800, 900, 1,800, 2,100, 2,300, 2,500, 3,300 మెగా హెట్జ్‌తో పాటు 26 గిగా హెట్జ్ బ్యాండ్‌ను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఈ వేలం కోసం రిలయన్స్ జియో ఇప్పటికే బయానా (ముందస్తు నగదు డిపాజిట్ గా)గా రూ.3,000 కోట్లు, భారతి ఎయిర్‌టెల్ రూ.1,050 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.300 కోట్లు కేంద్రానికి చెల్లించాయి.
ఈ వేలంలో.. 800 ఎంహెచ్ జెడ్ నుండి 26 జీహెచ్ జెడ్ వరకు ఫ్రీక్వెన్సీలను కవర్ చేస్తూ మొత్తం 10 జీహెచ్ జెడ్ రేడియో తరంగాలు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. జూలై 2022లో జరిగిన 5జీ స్పెక్ట్రమ్ వేలంలో అందుబాటులోకి వచ్చిన 72 జీహెచ్ జెడ్ కంటే ప్రస్తుత వేలం ఆఫర్ చాలా తక్కువే.
ఆగస్ట్ 2022లో జరిగిన చివరి స్పెక్ట్రమ్ వేలంలో ప్రభుత్వం రూ. 1.5 లక్షల కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఈ క్రమంలో మొబైల్ ఫోన్ సేవల కోసం ఎనిమిది స్పెక్ట్రమ్ బ్యాండ్ లను సుమారు రూ. 96,317 కోట్ల బేస్ ధరకు అందుబాటులో ఉంచింది.
ఈ 10వ వేలంలో 800, 900, 1,800, 2,100, 2,300, 2,500, 3,300 మెగా హెట్జ్‌తో పాటు 26 గిగా హెట్జ్ బ్యాండ్ అందుబాటులో ఉన్నాయి.
అయితే వేలం గతంలో పోలిస్తే పరిమితంగానే ఉంది. జియో, ఎయిర్‌టెల్ వోడాఫోన్ ఇప్పటికే తగినంత 5 జి స్పెక్ట్రం హోల్డింగ్ లను కలిగి ఉన్నాయి. అదనంగా కొత్తగా వినియోగదారులు వచ్చే అవకాశాలు లేకపోవడం వల్ల 5జీ స్ప్రెక్టమ్ వేలంలో ఎక్కువ మొత్తాన్ని కొనుగోలు చేయడం లేదని తెలుస్తోంది. ఈ దశ వేలానికి ఉన్న రూ.96,317 కోట్ల విలువైన స్పెక్ట్రమ్ లో కంపెనీలు కేవలం రూ.12500 కోట్లు (13 శాతం) మాత్రమే వెచ్చిస్తున్నాయి. ఆ మేరకు మాత్రమే స్పెక్ట్రమ్ ను కొనుగోలు చేయనున్నాయి.