Begin typing your search above and press return to search.

క్రిప్టో కరెన్సీ..6.2 లక్షల కోట్ల స్కామ్

యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ కు చెందిన ఫైనాన్స్ ప్రొఫెసర్ జాన్ ఆసక్తికర విషయాలు వెలుగులోకి తెచ్చారు. 4000 మంది ఈ క్రిప్టో కరెన్సీ స్కాంలో బాధితులుగా మారారని తెలిపారు.

By:  Tupaki Desk   |   2 March 2024 1:55 PM GMT
క్రిప్టో కరెన్సీ..6.2 లక్షల కోట్ల స్కామ్
X

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొందరు స్కామర్లు ఈ క్రిప్టో కరెన్సీ పై పెట్టుబడి పెట్టే వారిని టార్గెట్ గా చేస్తూ లక్షల కోట్ల రూపాయల స్కామ్ కు తెర తీశారు. 2020 జనవరి నుంచి 2024 ఫిబ్రవరి మధ్య 75 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 6.2 లక్షల కోట్లను క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో స్కామర్లు దోచుకున్నట్లుగా యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ కు చెందిన ఫైనాన్స్ ప్రొఫెసర్ జాన్ ఆసక్తికర విషయాలు వెలుగులోకి తెచ్చారు. 4000 మంది ఈ క్రిప్టో కరెన్సీ స్కాంలో బాధితులుగా మారారని తెలిపారు.

ఒక రాంగ్ నెంబర్ టెక్స్ట్ మెసేజ్ ద్వారా జనాలకు స్కామర్లు సందేశాన్ని పంపేవారని, ఆ సందేశానికి స్పందించిన తర్వాత క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు అంటూ వారిని దోచుకునే వారని తేలింది. అయితే, ఆ పెట్టుబడులు నకిలీ అని బాధితులు తెలుసుకునే సరికి స్కామర్లు అప్పటిదాకా పెట్టుబడి పెట్టిన డబ్బుతో మాయమైపోతారని వెల్లడించారు. ఈ రకంగా బాధితులు వందల డాలర్లు మొదలుకొని వేల డాలర్ల వరకు నష్టపోయారని చెప్పారు. ఇక ఈ విధంగా సందేశాలు పంపేవాళ్లు కూడా అక్రమ మానవ రవాణా బాధితులని, వారంతా దక్షిణాగ్నేయ ఆసియాకు చెందిన వారని తేలింది.

కంబోడియా వంటి దేశాల్లో అత్యధిక జీతానికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వారిని ఈ స్కాం మెసేజ్లు పంపే లా ట్రాప్ చేస్తున్నారని ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇలా దాదాపు రెండు లక్షల మంది చిక్కుకున్నట్లుగా యూఎన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇటువంటి క్రిప్టో స్కాం మెసేజ్ లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.