Begin typing your search above and press return to search.

జెఫ్ బెజోస్ నౌకలో కస్టమ్స్ సెర్చ్... సన్ బాత్ లో కాబోయే భార్య!

ప్రముఖ వ్యాపారవేత్త జెఫ్ బెజోస్ కు చెందిన విలాసవంతమైన నౌకలో కస్టమ్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

By:  Tupaki Desk   |   4 Jan 2025 5:15 AM GMT
జెఫ్ బెజోస్ నౌకలో కస్టమ్స్ సెర్చ్... సన్ బాత్ లో కాబోయే భార్య!
X

అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరు అయిన జెఫ్ బెజోస్ కు చెందిన సుమారు 500 మిలియన్ డాలర్ల విలాసవంతమైన నౌకలో ఆకస్మిక తనిఖీలు జరగడం చర్చనీయాంశంగా మారింది. రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా ఇది జరిగిందా.. లేక, దీనిపై అధికారులకు ఏదైనా పక్కా సమాచారం లభించిందా అనేది ఆసక్తిగా మారింది.

అవును.. ప్రముఖ వ్యాపారవేత్త జెఫ్ బెజోస్ కు చెందిన విలాసవంతమైన నౌకలో కస్టమ్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బెజోస్ కు చెందిన "కోరు" షిప్ లో సుమారు మూడు గంటల పాటు కస్టమ్స్ అధికారులు ఈ సోదాలు చేపట్టినట్లు చెబుతున్నారు. నూతన సంవత్సర వేడుకల వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది!

ఈ కస్టమ్స్ అధికారుల తనిఖీలు జరిగిన సమయంలో బెజోస్ కు కాబోయే భార్య లారెన్ శాంచెజ్ కూడా అదే నౌకలో ఉన్నారని.. ఆ సమయంలో ఆమె తన స్నేహితులతో కలిసి సన్ బాతింగ్ లో ఉన్నారని.. ఈ సమయంలో ఆమె నవ్వుతూ ఫోటోలకు ఫోజులిచ్చారని అంటున్నారు. దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్ గా మారింది.

ఈ మేరకు థెరిసా లాంగో ఫ్యాన్స్ ఎక్స్ లో ఈ సంఘటనను నివేదించారు. ఇందులో భాగంగా.. లారెన్ సాంచెజ్ తన కాబోయే భర్త జెఫ్ బెజోస్ యొక్క 500 మిలియన్ డాలర్ల నౌక, కోరులో సన్ బాత్ చేస్తుండగా.. న్యూ ఇయర్ వేళ 3 గంటల పాటు సాగిన రెగ్యులర్ సెర్చ్ కోసం కస్టమ్స్ అధికారులు ఆమెకు అంతరాయం కలిగించారని.. ఆమె అవేమీ పట్టించుకోకుండా చిరునవ్వులు చిందించారని రాసుకొచ్చారు.