Begin typing your search above and press return to search.

స్టేషన్ లో ఎస్సైల ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్... సీవీ ఆనంద్ రియాక్ట్!

ఇటీవల కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్ లకు క్రేజ్ పెరిగిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 Sep 2023 6:00 PM GMT
స్టేషన్ లో ఎస్సైల ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్... సీవీ ఆనంద్ రియాక్ట్!
X

ఇటీవల కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్ లకు క్రేజ్ పెరిగిన సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు వధూవరులు కలిసి ఓ వీడియోను షూట్ చేసి.. దానిని బంధువులు, స్నేహితులకు పంపి పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి వీడియోలు పోటాపొటీగా తీసుకుంటున్నారు కాబోయే జంటలు. ఈ క్రమంలో తాజాగా ఇద్దరు ఎస్సైల ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్ అవుతోంది.

అవును... పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఇద్దరు ఎస్సైలు ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ లో ఎస్సైగా పనిచేస్తోన్న భావన, అదే స్టేషన్ లో ఏఆర్ ఎస్సైగా పనిచేస్తున్న రావూరి కిషన్ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. ఈ సమయంలో ప్రీ వెడ్డింగ్ షూట్ ఒకటి చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.

మరోపక్క ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ యూనీఫాం తో ప్రీ వెడ్డింగ్ షూట్ ఏమిటని కొంతమంది ప్రశ్నిస్తుంటే... ఇందులో తప్పుపట్టేటంత తప్పేమీ లేదని, పెళ్లి అనేది జీవితంలో అతిముఖ్యమైన విషయం అని, దాన్ని వీలైనంత మదుర జ్ఞాపకంగా మలుచుకునే సమయంలో ఇదొక భాగమని సపోర్ట్ చేస్తున్నారు.

ఈ సమయంలో సీవీ ఆనంద్ కూడా ఈ వీడియోపై స్పందించారు. అవును... ఈ వీడియోను రీట్వీట్ చేసిన సీపీ సీవీ ఆనంద్... ఇద్దరు ఎస్సైలు పెళ్లి చేసుకోబోతున్నామన్న ఆనందంలో కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు అని అన్నారు. పెళ్లి వారికి గొప్ప విషయమే కావొచ్చు కానీ, పోలీస్ స్టేషన్ లో ప్రీ వెడ్డింగ్ వీడియో కొంచెం ఎబ్బెట్టుగా ఉందని తెలిపారు.

అదేవిధంగా... పోలీసు ఉద్యోగం అంటే కత్తిమీద సాములాంటిందని.. మహిళలకైతే మరింత కష్టమని చెప్పిన సీవీ ఆనంద్... ఈ ఉద్యోగంలో ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు మూడు ముళ్ల బంధంతో ఒక్కతవ్వడం సంతోషించాల్సిన విషయం అని అన్నారు.

ఇదే సమయంలో... ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ కోసం పోలీస్‌ దుస్తుల్ని, చిహ్నాలను ఉపయోగించడాన్ని తాను తప్పుబట్టడం లేదు కానీ... ఈ విధమైన చర్యలకు ముందే అనుమతి తీసుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇక, వాళ్లు తనను పెళ్లికి పిలవకపోయినా, వెళ్లి ఆశీర్వదించాలని ఉందని చెప్పడం కొసమెరుపు.