జగన్ తరువాత చిన్నమ్మే మరి !
ఇక ఏపీలో చూస్తే పార్టీ అధినేతలలో జగన్ తరువాత బీజేపీకి చెందిన రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అల్లు అర్జున్ అరెస్ట్ ని ఖండించారు.
By: Tupaki Desk | 15 Dec 2024 12:30 AM GMTపాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో పెను ప్రకంపనలు సృష్టించింది. ఆయన రీసెంట్ మూవీ పుష్ప టూ ఒక వైపు టాప్ లెవెల్ లో దూసుకుపోతున్న వేళ అల్లు అర్జున్ అరెస్ట్ అన్నది అతి పెద్ద సంచలనమే అయింది.
ఇక అల్లు అర్జున్ అరెస్ట్ రాజకీయంగా కూడా రంగు తీసుకుంది. ఆయన అరెస్ట్ విషయంలో తెలంగాణాలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విపక్షాలు విరుచుకుపడ్డాయి. బీఆర్ఎస్ తెలంగాణాలోని బీజేపీ వంటి పార్టీలు అయితే రేవంత్ రెడ్డి మీద డైరెక్ట్ ఎటాక్ చేశాయి.
అదే సమయంలో కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి బీజేపీ సీనియర్ నేత అశ్విని వైష్ణవ్ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ ని తప్పుపడుతూ రేవంత్ రెడ్డి మీద ఘాటు విమర్శలు చేశారు. క్రియేటివిటీ ఫీల్డ్ మీద మొదటి నుంచి కాంగ్రెస్ కి చిన్న చూపే ఉందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇక ఏపీలో చూస్తే వైసీపీ ఈ విషయం మీద గట్టిగానే రియాక్ట్ అయింది ఏకంగా వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ అయితే ఈ అరెస్ట్ ని ఖండించారు. ఇది పూర్తిగా తప్పు అన్నట్లుగా ట్వీట్ చేశారు. నిజానికి జగన్ నుంచి ఇలాంటి ట్వీట్లను ఎవరూ ఆశించలేరు. ఆయన ఈ తరహా విషయాల మీద అతి తక్కువగా స్పందిస్తూంటారు. కానీ ఆయన రియాక్టు కావడం అంటే దాని వెనక సీనియర్ నేత శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఉన్నారని అంటున్నారు.
ఈ సమయంలో అల్లు అర్జున్ విషయంలో ఖండిస్తే బలమైన ఒక సామాజిక వర్గం కొంతలో కొంత పాజిటివ్ గా వైసీపీ వైపు ఉంటుందన్న సూచనలతోనే ఆయన ఇలా చేసారు అని ఒక గాసిప్ అయితే ఉంది. ఇక బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు గుడివాడ అమరనాథ్ వంటి వారు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ ని తీవ్రంగా ఖండించారు. ఏది ఏమైనా ఏపీ మొత్తానికి వైసీపీ మాత్రమే దీని మీద రియాక్ట్ అయింది అని అంటున్నారు.
టీడీపీ నుంచి ఎవరూ ఖడించలేదు. అయితే చంద్రబాబు అల్లు అరవింద్ తో అల్లు అర్జున్ తో ఫోన్ లో మాట్లాడారని ప్రచారం సాగింది. ఇక ఏపీలో చూస్తే పార్టీ అధినేతలలో జగన్ తరువాత బీజేపీకి చెందిన రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అల్లు అర్జున్ అరెస్ట్ ని ఖండించారు.
అల్లు అర్జున్ వచ్చినపుడు జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది అంటే దానికి కారణం అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆమె విమర్శించారు. ప్రభుత్వం తన నిర్లక్ష్యాన్ని ఒక హీరో మీదకు నెట్టడమేంటి అని ఆమె ఆగ్రహించారు. ఈ విషయంలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం ఏ మాత్రం సహేతుకం కాదని ఆమె అన్నారు.
ఇక ఏపీలో చూస్తే కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉంటూ ప్రతీ చిన్న విషయం మీద ట్వీట్ చేసే వైఎస్ షర్మిల మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. ఎందుకంటే తెలంగాణాలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. పైగా రేవంత్ రెడ్డిని అన్నా అంటూ కొత్త రాజకీయ బంధాన్ని ఆమె కలుపుకున్నారు. వామపక్షాలు అయితే ఏ విధంగానూ రెస్పాండ్ కాలేదు.
మొత్తంగా చూస్తే జగన్ తరువాత చిన్నమ్మే ఏపీలో బాహాటంగా అల్లు అర్జున్ అరెస్ట్ ని ఖండించారు అని చెప్పాలి. ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ అధికార కూటమిలో ఉన్నాయి. ఇందులో బీజేపీ మాత్రమే రియాక్ట్ కావడం అంటే రాజకీయంగా అది కూడా చర్చగానే ఉంది.