Begin typing your search above and press return to search.

బాలయ్య బాల్యం గురించి బావ గారు..

ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో దగ్గుబాటి అనేక అంశాల మీద మాట్లాడారు. అందులో భాగంగా బాలయ్య ప్రస్తావన రాగా.. తన బావమరిది బాల్యం గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

By:  Tupaki Desk   |   15 March 2025 6:08 PM IST
బాలయ్య బాల్యం గురించి బావ గారు..
X

నందమూరి బాలకృష్ణకు ఒకప్పుడు తన పెద్ద బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు అంటే పడేది కాదు. రాజకీయంగా ఇద్దరూ వేర్వేరు దారుల్లో సాగారు. ఓ సందర్భంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ దగ్గుబాటి ఇంటి ముందు బాలయ్య తొడగొట్టడం ఎంత వివాదాస్పదం అయిందో తెలిసిందే. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. ఇరు కుటుంబాల మధ్య సఖ్యత ఏర్పడింది.

తనకు బద్ధ శత్రువుగా పేర్కొనే చంద్రబాబుకు సైతం ఆయన స్నేహ హస్తం చాటారు. ఇటీవల ఈ తోడళ్ళుళ్ళ కలయిక చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో దగ్గుబాటి అనేక అంశాల మీద మాట్లాడారు. అందులో భాగంగా బాలయ్య ప్రస్తావన రాగా.. తన బావమరిది బాల్యం గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తాను పురంధరేశ్వరిని పెళ్లి చేసుకున్న సమయంలో బాలయ్య పిల్లవాడంటూ ఆ రోజుల్లో తనేం చేసేవాడో చెప్పుకొచ్చారు దగ్గుబాటి.

తమ పెళ్లి సమయంలో బాలయ్య బ్లూ నిక్కర్, అదే కలర్ టెర్లిన్ షర్ట్ వేసుకున్నాడని.. తెల్లగా, భలే అందంగా ఉండేవాడని దగ్గుబాటి గుర్తు చేసుకున్నారు. బాలయ్య ముక్కులో చీమిడి వస్తే ఎలా తుడుచుకునేవాడో హావభావాలతో చేసి చూపించారు దగ్గుబాటి. అప్పట్లో బాలయ్యను ఒక ఆయా చూసుకునేదని.. అతను చిన్నపిల్లవాడు, ఆమె వయసులో చాలా పెద్దది అయినా సరే.. ఇద్దరూ కలిసి శ్రీకృష్ణుడు-సత్యభామ వేషాలతో నాటకాలు వేసేవారని దగ్గుబాటి చెప్పారు.

పది పన్నెండేళ్ల వయసులోనే కృష్ణుడి పాత్ర వేసి డైలాగులు అద్భుతంగా చెప్పేవాడని దగ్గుబాటి తెలిపారు. చిన్నతనంలోనే బాలయ్యలోని నటుడు బయటికి వచ్చాడని.. అతను హాస్యం చాలా బాగా పండించేవాడని దగ్గుబాటి చెప్పారు. ఇక ఎన్టీఆర్ పిల్లలు అందరిలో హరికృష్ణ చాాలా సరదా, అల్లరి మనిషి అని.. అందరితో సరదాగా ఉండేవాడని.. అదే సమయంలో తమను చాలా గౌరవించేవాడని దగ్గుబాటి గుర్తు చేసుకున్నారు.