Begin typing your search above and press return to search.

చంద్రబాబు అరెస్ట్‌ పై రియాక్షన్... సురేష బాబు కీలక వ్యాఖ్యలు!

తాజా "సప్త సాగరాలు దాటి" అనే సినిమా ప్రెస్‌ మీట్‌ లో పాల్గొన్న దగ్గుబాటి సురేష్ బాబును, చంద్రబాబు అరెస్ట్ పై స్పందించాలని కోరగా ఆయన స్పందించారు.

By:  Tupaki Desk   |   19 Sep 2023 8:49 AM GMT
చంద్రబాబు అరెస్ట్‌  పై రియాక్షన్... సురేష బాబు కీలక వ్యాఖ్యలు!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు అరెస్ట్ విషయంలో టీడీపీ - వైసీపీ నేతల మధ్య నిత్యం మాటల యుద్ధం నడుస్తుంది. ఈ సమయంలో సురేష్ బాబు స్పందించారు.

అవును... తాజా "సప్త సాగరాలు దాటి" అనే సినిమా ప్రెస్‌ మీట్‌ లో పాల్గొన్న దగ్గుబాటి సురేష్ బాబును, చంద్రబాబు అరెస్ట్ పై స్పందించాలని కోరగా ఆయన స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమ రాజకీయాలకు, మతపరమైన అంశాలకు ఎప్పుడూ దూరంగానే ఉందని స్పష్టం చేశారు.

అందుకే సున్నితమైన విషయాలపై చిత్ర పరిశ్రమ నుంచి స్పందన ఉండదని.. అందులో భాగంగానే తెలంగాణ, ఆంధ్ర విషయంలోనూ సినీ పరిశ్రమ స్పందించలేదని ఆయన పేర్కొన్నారు. స్పందించాలంటే రోజూ రాజకీయంగా ఏదో ఒక విషయం ఉంటూనే ఉంటుంది. అయితే అది తమ బాధ్యత కాదని అన్నారు.

"పరిశ్రమ ఎప్పుడూ రాజకీయంగా ప్రకటనలు ఇవ్వటం మంచిది కాదు. ఎందుకంటే మేము రాజకీయ నాయకులం కాదు, మేము మీడియా వాళ్ళం కాదు, మేము సినిమాలు నిర్మించడానికి వచ్చాం, సినిమాలు తీస్తాం. నన్ను అడిగితే చిత్ర పరిశ్రమ రాజకీయాల ప్రకటనలు ఇవ్వటం మంచిది కాదని అనుకుంటున్నాను" అని అన్నారు.

ఇదే సమయంలో "మా నాన్నగారు (రామానాయుడు) తెలుగుదేశం మెంబెర్, నేను కూడా పార్టీకి పని చేసాను. అది మా వ్యక్తిగతం. కానీ పరిశ్రమకి వచ్చినప్పుడు నేను ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా పరిశ్రమకి చెందిన వాళ్ళం" అని చెప్పారు.

అనంతరం.. "చాలామంది ముఖ్యమంత్రులు పరిశ్రమకి చాలా చేశారు. చెన్నారెడ్డి గారు అయితే చాలా హెల్ప్ చేశారు, తరువాత ఎన్టీఆర్ గారు చేశారు. చంద్రబాబు గారు కూడా చిత్ర పరిశ్రమకి చాలానే చేశారు. ఈ సమయంలో చిత్ర పరిశ్రమ స్పందించటం లేదు అన్నది కరెక్టు కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయిడు అరెస్టు అనేది చాలా సున్నితమైన ఇష్యూ. ఆంధ్రా, తెలంగాణ గొడవలప్పుడు కూడా పరిశ్రమ నుండి ఎటువంటి స్పందన రాలేదు" అని స్పష్టం చేశారు.

కాగా... చంద్రబాబు అరెస్ట్ పై దర్శకుడు రఘవేంద్ర రావు, నిర్మాతలు అశ్వినీదత్, నట్టి కుమార్ లు స్పందించిన సంగతి తెలిసిందే.