Begin typing your search above and press return to search.

తనను ఓడించింది దేవుడే... దగ్గుబాటి వేదాంతం వెనుక అసలు కారణం ఇదే!

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధానంగా ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో

By:  Tupaki Desk   |   26 Dec 2023 4:10 AM GMT
తనను ఓడించింది దేవుడే... దగ్గుబాటి వేదాంతం వెనుక అసలు కారణం ఇదే!
X

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధానంగా ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో... పార్టీలు మారేవారు, రీ ఎంట్రీ ఇచ్చేవారు, అసంతృప్తులు ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్నారని తెలుస్తుంది. ఆ సంగతి అలా ఉంటే... భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి భర్త, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు తాజాగా తెరపైకి వచ్చారు. జగన్ పై వ్యాఖ్యలు చేశారు.

అవును... ఒకానొక సమయంలో చంద్రబాబును తీవ్రస్థాయిలో వ్యతిరేకించిన దగ్గుబాటి వెంకటేశ్వర రావు.. గత ఎన్నికల్లో ఓటమి అనంతరం సైలంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి రాజకీయాల్లోకి రానున్నారనే సంకేతాలు వినిపిస్తున్నాయి. తాజాగా మైకుల ముందుకు వచ్చిన ఆయన చేసిన కామెంట్లు అదే సంకేతాలు ఇస్తున్నాయని తెలుస్తుంది.

వివరాళ్లోకి వెళ్తే... ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు 2019 ఎన్నికల్లో జగన్ నాయకత్వంలో వైసీపీ టిక్కెట్ నుంచి పోటీచేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సాంబశివరావు చేతిలో 1,647 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనంతరం వైసీపీని వీడారు. గత నాలుగున్నరేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

ఇప్పుడు మరో మూడు నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరోసారి మైకులముందుకు వచ్చారు! ఇందులో భాగంగా... క్రియాశీలక రాజకీయాలపై ఆయన మరోసారి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా మైకుల ముందుకు వచ్చిన ఆయన... గత ఎన్నికల్లో పర్చూరు ఓటర్లు తనను ఓడించి మంచిపని చేశారని చెప్పుకున్నారు!

ఈ సందర్భంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తనను గెలిపించి ఉంటే ఈ రోజు తన పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించిన ఆయన... ఎన్నికై ఉంటే, ఓటర్ల కోసం ఏమీ చేయనందుకు తల ఎత్తుకుని తిరగలేకపోయేవాడిని అని.. ఇదంతా ప్రజలు చేయలేదు ఆ దేవుడే చేశాడని అన్నారు. ఈ సందర్భంగా తన కుమారుడికి మంత్రి పదవి విషయంపైనా వెంకటేశ్వర రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... తాను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ తనకు ఫోన్ చేసి తన కుమారుడిని ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అది కూడా జరగలేదంటే... అదంతా చేసింది భగవంతుడే అని వెంకటేశ్వర రావు అన్నారు. తాను ఎమ్మెల్యే అవ్వలేదు, తన కొడుక్కి ఎమ్మెల్సీ లేదు, మంత్రి లేదు.. ఇదంతా దేవుడి దయ అని చెప్పుకున్నారు.

దీంతో... చంద్రబాబు వియ్యంకుడి బాధ అంతా తన కుమారుడిని ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇవ్వలేదనేనా అనే చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది. ఓడిపోయినంత మాత్రాన్న.. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిపదవి ఇవ్వనంతమాత్రాన్న పార్టీని వీడి సైలంట్ ఉన్న ఆయన.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ రోడ్లు వేయలేదని.. అలా వేయలేని నాయకత్వంలో పనిచేయకుండా దేవుడే తనను ఓడించాడని చెబుతుండటం గమనార్హం.

ఈ నేపథ్యంలో... దగ్గుబాటి వెంకటేశ్వర రావు టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చి లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఆయన భార్య పురందేశ్వరి బీజేపీలో పెద్ద పదవిలో ఉండటంతో టీడీపీలో చేరలేరు కాబట్టి... వెంకటేశ్వర రావు కానీ, తన కొడుకు కానీ టీడీపీ రాజకీయాల్లో ఉండాలని భావిస్తున్నట్లున్నారనే కామెంట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి!