థాయిలాండ్ నుంచి విశాఖకు బల్లులు... అధికారుల ఆసక్తికర నిర్ణయం!
ఇందులో భాగంగా... ఆ మూడు నీలిరంగు నాలుక కలిగిన బల్లులతో పాటు మూడు వెస్ట్రన్ బల్లులను తిరిగి థాయిలాండ్ కు పంపించారు.
By: Tupaki Desk | 27 Nov 2024 2:50 PM GMTకాదేదీ స్మగ్లింగ్ కు అనర్హం అన్నట్లుగా సాగుతుంటాయి కొన్ని వ్యవహారాలు. ఇందులో భాగంగా.. విదేశాల నుంచి అక్రమంగా బంగారం, వజ్రాలు, రకరకాల పాములు తరలిస్తూ.. ఎయిర్ పోర్ట్ లో పట్టుబడిన వారికి సంబంధించిన అనేక కేసుల సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా థాయిలాండ్ నుంచి విశాఖకు బల్లులు తెచ్చిన ఘటన తెరపైకి వచ్చింది.
అవును... థాయిలాండ్ నుంచి విశాఖకు అత్యంత ప్రమాదకరమైన బల్లులను తరలిస్తుండగా విమానాశ్రయంలో కస్టమ్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీ.ఆర్.ఐ) అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా... నీలిరంగు నాలుక కలిగిన మూడు బల్లులతో పాటు, మరో మూడు వెస్ట్రన్ బల్లులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా థాయిలాండ్ నుంచి వీటిని అక్రమంగా తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. డీ.ఆర్.ఐ. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో వీటిని గుర్తించారు. ఈ క్రమంలో స్వాధీనం చేసుకున్న బల్లులను ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా అధికారులు ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు.
ఇందులో భాగంగా... ఆ మూడు నీలిరంగు నాలుక కలిగిన బల్లులతో పాటు మూడు వెస్ట్రన్ బల్లులను తిరిగి థాయిలాండ్ కు పంపించారు. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. మరోపక్క కేక్ ప్యాకెట్స్ లో భద్రపరిచి ఈ బల్లులను తీసుకొచ్చిన ఇద్దరిని ఎయిర్ పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.