జైల్లో దర్శన్ అనారోగ్యంగా.. సర్జరీ చేయాలంటూ
జైల్లో ఉన్న దర్శన్ తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. అతడికిప్పుడు సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు.
By: Tupaki Desk | 23 Oct 2024 11:29 AM GMTకన్నడ నటుడు దర్శన్ అరెస్ట్ అయి మూడు నెలలకు పైగానే అయింది. ప్రస్తుతం అతడు బళ్లారి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. బెయిల్ కోసం శత విధాల ప్రయత్నాలు చేస్తున్నా? ఫలించడం లేదు. ఈనేపథ్యంలో తాజాగా ఆయన అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. జైల్లో ఉన్న దర్శన్ తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. అతడికిప్పుడు సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు.
ఈ నేపథ్యంలోనైనా బెయిల్ ఇవ్వాలని దర్శన్ తరుపు న్యాయ వాదుల పట్టుబడుతున్నారు. నేర విచారణలో అనేక లోపాలున్నాయని, అన్ని అధారాలను పోలీసులే సృష్టించి తప్పుడు కేసు బనాయించినట్లు దర్శన్ న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. తదరుపరి విచారణ కూడా అవసరం లేదని వాదించారు. ఈ నేపథ్యంలో దర్శన్ ఆరోగ్యంపై వైద్య నివేదిక ఇవ్వాలని జడ్జ్ ఆదేశాలిచ్చి వాయిదా వేసారు. దీంతో దర్శన్ బెయిల్ మరోసారి వాయిదా పడినట్లు అయింది.
అయితే దర్శన్ అనారోగ్యానికి గురైన నేపథ్యంలో వైద్యానికి సంబంధించిన నివేదిక అందగానే కోర్టు బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. జూన్ 10న దర్శన్ అరెస్ట్ అయ్యాడు. ఈ కేసులో అతడు ఏ2 నిందితుడిగా ఉండగా పవిత్ర గౌడ ఏ-1గా ఉంది. ఇటీవలే ఈ కేసులో పోలీసులు కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయడంతో బెయిల్ వస్తుందని దర్శన్ భార్య విజయలక్ష్మి ఆశించింది.
కానీ విచారణ జరిగిన ప్రతీసారి వాయిదా పడటం తప్ప బెయిల్ మంజూరు అవ్వలేదు. కేసులో సాక్ష్యాలన్నీ దర్శన్ కి ప్రతికూలంగానే ఉండటంతో బెయిల్ సాధ్యమవ్వలేదు. దీంతో దర్శన్ తరుపు న్యాయ వాదులు పోలీసులే కేసును తప్పు దారి పట్టిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.