Begin typing your search above and press return to search.

బ‌ళ్లారి జైలుకి అందుకే త‌ర‌లించారా?

ప‌రప్ప‌న్ అగ్ర‌హారం జైలులో ఛాలెంజింగ్ స్టార్ ద‌ర్శ‌న్ టీ-సిగ‌రెట్ అండ్ రౌడీ షీట‌ర్ల‌తో ముచ్చ‌ట్ల వీడియో ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 Aug 2024 9:32 AM GMT
బ‌ళ్లారి జైలుకి అందుకే త‌ర‌లించారా?
X

ప‌రప్ప‌న్ అగ్ర‌హారం జైలులో ఛాలెంజింగ్ స్టార్ ద‌ర్శ‌న్ టీ-సిగ‌రెట్ అండ్ రౌడీ షీట‌ర్ల‌తో ముచ్చ‌ట్ల వీడియో ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. దెబ్బ‌కి జైలు అధికారులు స‌స్పెండ్ అయ్యారు. అక్క‌డ నుంచి ద‌ర్శ‌న్ ని బ‌ళ్లారి జైలుకి త‌ర‌లించ‌డం జ‌రిగింది. అయితే ద‌ర్శ‌న్ వీడియో ఎలా బ‌య‌ట‌కి వ‌చ్చింద‌న్న‌పై నెట్టింట పెద్ద చ‌ర్చేసాగింది. ఇద్ద‌రు ఖైదీల మ‌ధ్య గొడ‌వ కార‌ణంగానే ద‌ర్శ‌న్ వీడియోని బ‌య‌ట‌కు రిలీజ్ చేసిన‌ట్లు ప్ర‌చారం సాగింది.

డ‌బ్బులిస్తే జైలులో అన్ని ర‌కాల సుఖాలు దొరుకుతాయ‌ని మాజీ ఖైదీలు కొంద‌రు చెప్ప‌డంతోనే అక్క‌డ స‌న్నివేశం ఎలా ఉంటుంది? డ‌బ్బుకి ఎలాంటి ప్రాధాన్య‌త ఉంటుంది? అన్న‌ది అద్దం ప‌డుతుంది. అలా డ‌బ్బుకి ఆశ‌ప‌డే ద‌ర్శ‌న్ వీడియో రిలీజ్ చేసిన‌ట్లు నెట్టింట ప్ర‌చారం సాగింది. కానీ ఇదంతా అవాస్త‌వ‌మ‌ని జైలు అధికారులు కొట్టిపారేసారు అనుకోండి. కానీ ప‌రప్ప‌న్ జైలు అధికారుల తీరును మాత్రం క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం సీరియ‌స్ అయింది.

ఉన్న‌త అధికారుల విచార‌ణ‌కు ఆదేశించింది ప్ర‌భుత్వం. విచార‌ణ అనంత‌రం ఖైదీల వ‌ద్ద‌కు ఫోన్లు ఎలా వ‌చ్చాయి? అక్క‌డ పార్టీ తంతు? వీడియో ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చింది? ఇలా అన్ని విష‌యాలు నిగ్గు తేలుతాయి. అయితే ఇలాంటి వేషాలేవి బ‌ళ్లారి జైలులో కుద‌ర‌వు. అందుకే అగ్ర‌హారం నుంచి ప్ర‌త్యేకంగా బ‌ళ్లారి జైలుకి తర‌లించిన‌ట్లు అధికారులు భావిస్తున్నారు.

మొత్తం 17 మందిపై చార్జ్ షీట్ ఫైల్ అయింది. వీరంద‌ర్నీ వివిధ జైళ్ల‌కు త‌ర‌లించిన‌ట్లు స‌మాచారం. పవిత్రా గౌడ, అనుకుమార్, దీపక్‌లను పరప్ప అగ్రహార జైలులోనే ఉంచారు. ఇక్క‌డ ఉన్న‌న్ని రోజులు కుటుంబ స‌భ్యులు వ‌చ్చి వెళ్ల‌డం జ‌రిగేది. కానీ బ‌ళ్లారిలో ఆ అవ‌కాశం చాలా త‌క్కువ‌గా ఉంటుంది. అక్క‌డి జైలు అధికారులు క‌ఠినంగా ఉంటార‌ని..రూల్స్ క‌ఠినంగా ఉంటాయ‌ని అంటున్నారు.