రేణుకాస్వామి మర్డర్ కేసులో సాక్ష్యాలు ఏఐ క్రియేషన్?
సంచలనంగా మారిన కన్నడ అభిమాని రేణుకాస్వామి మర్డర్ కేసులో నిందితులుగా ఉన్న దర్శన్ , పవిత్రా గౌడ్ సహా మరో 15 మందిపై పోలీసులు కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసారు.
By: Tupaki Desk | 8 Oct 2024 9:30 PM GMTసంచలనంగా మారిన కన్నడ అభిమాని రేణుకాస్వామి మర్డర్ కేసులో నిందితులుగా ఉన్న దర్శన్ , పవిత్రా గౌడ్ సహా మరో 15 మందిపై పోలీసులు కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసారు. దీంతో కోర్టులో కేసు విచారణ ప్రారంభమైంది. రేణుకాస్వామి హత్య సమయంలో బయటకు వచ్చిన ఫోటోలు అన్నీ వాస్తవమా? అబద్దమా? అన్న ప్రశ్న తలెత్తింది. పోలీసులు చూపిస్తోన్న సాక్ష్యాలన్నీ అబద్దాలని...అవన్నీ ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో సృష్టించిన సాక్ష్యాలంటూ దర్శన్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు.
కొన్ని సాక్ష్యాలు పోరెన్సిక్ ల్యాబ్ నుంచి పోలీసుల చేతికి ఇంకా అందలేదు. ఆర్ ఆర్ నగర్ లోని బస్ షెడ్డులో రేణుకాస్వామిని బంధించి దర్శన్ , పవిత్రా గౌడ్ , వాళ్లనుచరులు తీవ్రంగా కొట్టి చంపారు? అన్నది అభియోగం. ఆ సమయంలోని కొన్ని ఫోటోలను పోలీసులు వారి ఫోన్ల నుంచి సేకరించినట్లు పోలీసులు తెలిపారు. రేణుకాస్వామి చేతులెత్తి నమస్కరించి కూర్చున్న ఫోటో, మృతదేహం ఫోటోలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేసినవి అని దర్శన్ న్యాయవాదులు వాదించారు.
ఈ ఫోటోలన్నింటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించి త్వరగా నివేదిక ఇవ్వాలని పోలీసులను కోరారు. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరుగుతుంది. ఈ సాక్ష్యాలన్నీ పోలీసులు అందించినవే కావడంతో? వాళ్లే వాటిని వాస్తవాలు అని నిరూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మద్య కాలంలో ఏఐ టెక్నాలజీతితో ఏది ఒరిజినలో.. ఏది డూప్లికేట్ ? అన్నది కనిపెట్టడం సమస్యగా మారింది. ఇక ఈ కేసులో దర్శన్ కి ఏమాత్రం సాక్ష్యలు అనుకూలంగా లేని సంగతి తెలిసిందే.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు కీలక సాక్ష్యాలు సంపాదించారు. వాటిలో కొన్నింటిని ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా కూడా నిర్దారించుకున్నారు. మరికొన్ని నివేదికలు రావాల్సి ఉంది. ఇవన్నీ కూడా దర్శన్ కి వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ ఏఐ టెక్నాలజీ కారణంగా ఈ కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి రావడం ఆసక్తికరం.