బటర్ చికెన్ కోసం పేటెంట్.. కోర్టు వరకూ వెళ్లిన వివాదం
చికెన్ అంటే అందరికి ఇష్టమే. దాన్ని చూస్తేనే నోరూరుతుంది. అందుకే మన దేశంలో అధిక శాతం మంది చికెన్ బిర్యానీ తింటున్నారు
By: Tupaki Desk | 27 March 2024 5:30 AM GMTచికెన్ అంటే అందరికి ఇష్టమే. దాన్ని చూస్తేనే నోరూరుతుంది. అందుకే మన దేశంలో అధిక శాతం మంది చికెన్ బిర్యానీ తింటున్నారు. చికెన్ తో చాలా రకాలైన వంటకాలు చేసుకోవచ్చు. అందులో బటర్ చికెన్ కూడా ప్రధానమైనది. బటర్ చికెన్ విషయంలో ప్రస్తుతం ఓ వివాదం నెలకొంది. దాన్ని కనుగొన్నది తామేనని రెండు యాజమాన్యాలు గొడవకు దిగుతున్నాయి. చివరకు కోర్టు వరకు కూడా వెళ్లారు.
వివాదానికి కేంద్రమైన ఢిల్లీకి చెందిన మోతీ మహల్, దర్యాగంజ్ రెస్టారెంట్ల యజమానుల మధ్య పరువు నష్టం దావా వేసే వరకు వెళ్లడం గమనార్హం. వాల్ స్ట్రీట్ జర్నల్ వార్తాపత్రికలో వచ్చిన ఓ ఇంటర్వ్యూ వీరి మధ్య గొడవకు కారణమైంది. బటర్ చికెన్ మూలాలపై మోతీ మహల్ చేసిన పరువు నష్టం వ్యాఖ్యలపై దర్యాగంజ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
ఇంటర్వ్యూలో వచ్చిన అంశం సంపాదకీయం కావడంతో దాని గురించి తమకు ఆపాదించడం సరైంది కాదని మహల్ యజమానులు తెలిపారు. దీనికి సంబంధించిన ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని మోతీ మహల్ యజమానులకు జస్టిస్ సంజీవ్ నరులా ఆదేశించడంతో వివాదం తీవ్రమైంది. తమ పూర్వీకుడైన దివంగత కుందన్ లాల్ గుజ్రాల్ బటర్ చికెన్, దాల్ మఖానీ వంటకాలను కనుగొన్నారని పేర్కొన్నారు.
రెండు వంటకాలపై దర్యాగంజ్ పౌరులను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. మోతీ మహల్ యజమానులు కోర్టును ఆశ్రయించడంతో వివాదం ప్రారంభమైంది. దీంతో బటర్ చికెన్ వ్యవహారం కోర్టు వరకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కేసు ఎక్కడ దాకా వెళ్తుందో తెలియడం లేదు. రెండు యాజమాన్యాలు దీన్ని దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
బటర్ చికెన్ అంటే అందరికి ఎంతో పసందు. నోట్లో వేసుకుంటే దాని రుచే వేరు. అందులో ఉండే మజాయే అదో రకం. అందుకే మన దేశంలో దీనికి విలువ ఏర్పడింది. ఇప్పుడు దాన్ని రెండు రెస్టారెంట్లు తమ వంటకంగా చెబుతుండటంతో ఎవరిది పైచేయి అవుతుందో తెలియడం లేదు. మొత్తానికి వంటకాల విషయంలో కోర్టులకు వెళ్లడం ఇదే తొలిసారి అని అంటున్నారు.