Begin typing your search above and press return to search.

పులివెందుల నుంచి పోటీ చేస్తా.. జగన్‌ ను ఢీకొడతా!

ఈ కేసు విచారణలో భాగంగా తాజాగా హైదరాబాద్‌ లోని నాంపల్లి కోర్టుకు హాజరైన దస్తగిరి.. మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు

By:  Tupaki Desk   |   27 Feb 2024 1:15 PM GMT
పులివెందుల నుంచి పోటీ చేస్తా.. జగన్‌ ను ఢీకొడతా!
X

వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసి.. సీఎం వైఎస్‌ జగన్‌ ను ఢీకొడతానని వైఎస్‌ వివేకా హత్య కేసులో అప్రూవర్‌ గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసు విచారణలో భాగంగా తాజాగా హైదరాబాద్‌ లోని నాంపల్లి కోర్టుకు హాజరైన దస్తగిరి.. మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని ఉందని సంచలన ఆరోపణలు చేశారు.

వివేక హత్య కేసులో తనను అప్రూవర్‌ గా మారాలని సీబీఐ ఎస్పీ రామ్‌ సింగ్‌ కొట్టి ఒప్పించారని చెప్పాలని దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి కోరాడని దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము చెప్పినట్టు చెబితే ఏకంగా రూ.20 కోట్లు అడ్వాన్స్‌ గా ఇస్తామని చైతన్య రెడ్డి ఆఫర్‌ చేశాడన్నారు. తాను జైలులో ఉన్న సమయంలో చైతన్య రెడ్డి డాక్టర్‌ గా వచ్చి జైలులో తనను ప్రలోభాలకు గురిచేశాడని దస్తగిరి ఆరోపించారు.

వివేకా పీఏ కృష్ణారెడ్డి ఎలా అయితే ఎస్పీ రాంసింగ్‌ పై ఆరోపణలు చేశారో అదేవిధంగా చెప్పాలంటూ తనను ఒత్తిడి చేశారని దస్తగిరి స్వయంగా సీబీఐ కోర్టుకు వెల్లడించాడని సమాచారం. ప్రలోభాలకు గురిచేసిన వారిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని సీబీఐని దస్తగిరి కోరాడు. నాన్‌–బెయిలబుల్‌ వారెంట్‌ జారీ కావడంతో సీబీఐ కోర్టుకు హాజరైన సందర్భంగా ఈ విషయాలను దస్తగిరి మీడియాకు వివరించాడు. కాగా దస్తగిరి రీకాల్‌ పిటిషన్‌ ను సీబీఐ కోర్టు అనుమతించింది.

త్వరలో తాను రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని దస్తగిరి వెల్లడించాడు. పులివెందుల నుంచి పోటీ చేస్తానని.. జగన్‌ ఢీకొంటానని తెలిపాడు.

వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డి, మనోహర్‌ రెడ్డి. దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి తనను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దస్తగిరి ఆరోపించాడు. వివేక హత్య కేసులో సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ తనను కొట్టి అప్రూవర్‌గా మార్చాడని తనతో చెప్పించాలని ప్రయత్నం చేస్తున్నారని దస్తగిరి సంచలన ఆరోపణలు చేశాడు.

వివేక హత్య వల్ల రాజకీయంగా ఆంధ్రప్రదేశ్‌ లో ప్రభావితమవుతామని వారంతా భావిస్తున్నారని దస్తగిరి తెలిపాడు. రూ.20 కోట్లు అడ్వాన్స్‌ తీసుకోవాలని దేవి రెడ్డి శివ శంకర్‌ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి ప్రలోభానికి గురిచేశాడని ఆరోపించాడు. తాను జైల్లో ఉన్న సమయంలో డాక్టర్‌ లాగా లోపలికి వచ్చి డబ్బులు ఆఫర్‌ చేశాడన్నాడు.

తనకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ రావడంతో నాంపల్లి సీబీఐ కోర్ట్‌ విచారణకు హాజరయ్యానని దస్తగిరి తెలిపాడు. తాను అరెస్టు కాకుండా సీబీఐ కోర్టులో రీకాల్‌ పిటిషన్‌ వేశానన్నాడు. దీనికి కోర్టు అనుమతించిందన్నాడు. వివేక హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిందన్నాడు. ఆ కేసును నీరు గార్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అని దస్తగిరి పేర్కొన్నాడు.

వైసీపీ ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని ఉందని దస్తగిరి ఆరోపించాడు. తనకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తన పట్ల దయ ఉంచి రక్షణ కల్పించాలని కోరాడు. ఇందుకు సంబంధించి కోర్టులో కూడా పిటిషన్‌ వేస్తానన్నాడు. వివేకా హత్య కేసులో త్వరలోనే వాస్తవాలు బయటపడతాయని దస్తగిరి ఆశాభావం వ్యక్తం చేశాడు.