భారత్ లో కప్పు కాఫీ కంటే 1 జీబీ డేటా చీప్ 'డాట్' ట్వీట్ వైరల్!
ఈ సమయంలో.. ఇంటర్నెట్ ధరల విషయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యునికేషన్స్, ఇండియా (డాట్ ఇండియా) ఆసక్తికరమైన ట్వీట్ చేసింది.
By: Tupaki Desk | 3 Aug 2024 1:30 PM GMTభారత్ లో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువగా ఉంటుందనేది తెలిసిన విషయమే! ఇక్కడ జనాభా అధికంగా ఉండటంతో పాటు.. ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ ఉన్న మొబైల్ వినియోగం అన్ని ప్రాంతల్లోనూ అధికంగా పెరిగిందని అంటున్నారు. ఈ సమయంలో.. ఇంటర్నెట్ ధరల విషయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యునికేషన్స్, ఇండియా (డాట్ ఇండియా) ఆసక్తికరమైన ట్వీట్ చేసింది.
భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగం చాలా ఎక్కువనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సంగతి అలా ఉంటే... ఇంటర్నెట్ వినియోగం ఎక్కువా, తక్కువా అనే సంగతి కాసేపు పక్కనపెడితే... అటు అగ్రరాజ్యంతో పోల్చుకున్నా.. ఇటు వెనుకబడిన దేశాలతో కంపేర్ చేసుకున్నా... భారత్ లో ఇంటర్నెట్ డేటా ధరలు చాలా చీప్ అంటూ డాట్ ఇండియా పేర్కొంది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన ఫోటోను షేర్ చేసింది.
ఇందులో భాగంగా.. రోజువారీ నిత్యావసర వస్తువుల ధరలతో పోలిస్తే భారత్ లో 1జీబీ డేటా ఎంత సరసమైనదనే విషయం ఈ ఫోటో చూస్తే తెలుస్తుందన్నట్లుగా పేర్కొన్న డాట్ ఇండియా... భారత్ లో 1జీబీ డేటా ఒక కప్పు కాఫీ కంటే తక్కువ ధరకే లభిస్తుందని వెల్లడించింది. ఇందులో భాగంగా.. దీని ధర రూ.9.12 మాత్రమే అని తెలుస్తోంది!!
అవును... భారత్ లో ఓ కప్పు కాఫీ ధర కంటే కూడా 1జీబీ ఇంటర్నెట్ డేటా చీప్ గా వస్తోందంటూ డాట్ ఇండియా ఎక్స్ లో ఆసక్తికరంగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో... ఇతర దేశాల్లో 1జీబీ డేటా ధరలు ఎలా ఉన్నాయి.. భారత్ కంటే తక్కువగా ఉన్నాయా, ఎక్కువగా ఉన్నాయా అనే చర్చ తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం...!
లో 1జీబీ డేటా ధర రూ.9.12 కాగా... ఇజ్రాయేల్ లో 1జీబీ డేటా ధర రూ.8 గా ఉంది. ఇక కిర్గిస్తాన్ లో రూ.15.3, ఇటలీలో రూ.31.38 గా ఉన్న పరిస్థితి. ఇక అగ్రరాజ్యం అమెరికా విషయానికొస్తే... ఇక్కడ 1జీబీ డేటా కోసం రూ.500 ఖర్చు చేయాల్సి రాగా... ఆఫ్రికాలోని మలావీలో 1 జీబీ డేటా కోసం రూ.2000 వెచ్చించాలి!
ఇక తాజాగా లోక్ సభలో ప్రసంగించిన టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా... భారత్ లో ఇప్పుడు 1.17 బిలియన్ మొబైల్ కనెక్షన్, 930 మిలియన్స్ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉన్నాయని అన్నారు. ఇక ధరలు భారత్ లో కాల్ రేట్లు నిమిషానికి 53 పైసల నుంచి 3 పైసలకు పడిపోయిందని.. ఇది 93% తగ్గింపును సూచిస్తుందని అన్నారు.
ఈ నేపథ్యంలోనే... భారత్ లో 1జీబీ డేటా ధర రు.9.12 గా ఉందని.. ఇది ప్రపంచంలోనే అత్యంత చౌకైనదని మంత్రి వెళ్లడించారు. ఈ విషయాన్నే కళాత్మకంగా వెళ్లడించే ప్రయత్నం చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యునికేషన్స్ ఇండియా!