Begin typing your search above and press return to search.

డేటింగ్ యాప్ వాడే ముందు ఈ వార్నింగ్ చదవండి

తాము నిర్వహించిన సర్వేలో వెల్లడైన చేదు నిజం ఏమంటే.. మెసేజ్ కంపోజింగ్ కు సైతం పలువురు ఏఐ టూల్స్ ను వినియోగిస్తున్నట్లుగా గుర్తించారు.

By:  Tupaki Desk   |   14 Feb 2024 6:00 AM GMT
డేటింగ్ యాప్ వాడే ముందు ఈ వార్నింగ్ చదవండి
X

మారుతున్న కాలానికి తగ్గట్లు.. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతకు అనుగుణంగా ఇద్దరి మధ్య స్నేహానికి కానీ అనుబంధానికి కానీ సంబంధానికి కానీ పలు మాధ్యమాలు అందుబాటులోకి వస్తుంటాయి. డిజిటల్ ప్రపంచంలో డేటింగ్ యాప్ లు ఆ కోవలోకే వస్తాయి. డేటింగ్ యాప్ లు బోలెడన్ని. కానీ.. వాటిల్లోకి వెళ్లే ముందు.. ఈ అపాయాల గురించి అవగాహన ముఖ్యమని చెబుతున్నారు. ఈ విషయంలో చిన్న తప్పు దొర్లినా అందుకు భారీగా మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. తాజాగా డేటింగ్ యాప్ యూజర్లకు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫే కీలక సూచనలు చేస్తోంది.

ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇస్తున్న టిప్స్ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే డేటింగ్ యాప్ లతో అడ్డంగా దొరికిపోవటం ఖాయమని హెచ్చిరిస్తున్నారు. అందుబాటులోకి వచ్చిన ఏఐ సాయంతో నకిలీ ప్రొఫైల్స్ ను క్రియేట్ చేస్తున్నారని.. ఎదుటి వారిని మోసం చేసేందుకు ఈ టెక్నాలజీని ఆయుధంగా మార్చుకున్నట్లు పేర్కొంది.

భారత్ తో సహా ఏడు దేశాల్లో మేకాఫే సంస్థ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం డేటింగ్ యాప్ లను ఉపయోగించే వారిలో 90 శాతం మంది నకిలీ ప్రొఫైల్స్ కారణంగా మోసపోయిన వారేనని పేర్కొంది. అందుకే.. వీటి విషయంలో మరింత అప్రమ్తతంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తోంది. వ్యక్తిగతంగా కలవని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్ ల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.

తాము నిర్వహించిన సర్వేలో వెల్లడైన చేదు నిజం ఏమంటే.. మెసేజ్ కంపోజింగ్ కు సైతం పలువురు ఏఐ టూల్స్ ను వినియోగిస్తున్నట్లుగా గుర్తించారు. సైబర్ నేరగాళ్లు ఈ టూల్స్ తో అవతలివారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారని.. అందుకే ప్రొఫైల్ పిక్ అసలువా? నకిలీవా? అన్న విషయాన్ని తెలుసుకోవాలని పేర్కొన్నారు. డీపీలో కనిపించే ఫోటోలు ఒరిజినలా? కాదా? అన్నది క్రాస్ చెక్ చేసుకోవాలని పేర్కొంది.

డేటింగ్ యాప్ లోని యూజర్లలో దాదాపు 65 శాతం మంది ఏఐ టూల్స్ సాయంతో క్రియేట్ చేసుకున్న ఫోటోల్ని మాత్రమే డేటింగ్ యాప్ లలో పెట్టుకుంటున్నట్లుగా గుర్తించారు. ఈ కారణంగా ఏదైనా ప్రొఫైల్ నచ్చితే.. వారిపై ప్రేమను వ్యక్తం చేయాలనుకునే ముందు..వారిని నేరుగా చూడటం.. కలవటం.. మాట్లాడటం.. వారి వివరాల్ని తెలుసుకొని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే ప్రపోజల్ చెప్పాలే తప్పించి.. హడావుడి పడితే మాత్రం మొదటికే మోసపోవటం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఏఐ జమానాలో ఏ మాత్రం ఏమరుపాటుతో ఉన్నా అడ్డంగా బుక్ కావటం ఖాయం సుమి. సో.. బీకేర్ ఫుల్.