Begin typing your search above and press return to search.

కూతురు తలపై కెమెరా.. ఈ తండ్రి చేసిన పనికి అంతా షాక్

పాకిస్థాన్‌లోని ఓ సంఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. అక్కడి ఓ కూతురి తండ్రి చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

By:  Tupaki Desk   |   9 Sep 2024 8:30 AM GMT
కూతురు తలపై కెమెరా.. ఈ తండ్రి చేసిన పనికి అంతా షాక్
X

పాకిస్థాన్‌లోని ఓ సంఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. అక్కడి ఓ కూతురి తండ్రి చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ‘అదేంటి.. ఆ తండ్రి ఇలా ఎందుకు చేశాడు’ అని వింతగా ఆలోచిస్తున్నారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

కరాచీలో సంపన్న కుటుంబానికి చెందిన ఓ మహిళ తన కారుతో తండ్రి, కూతురు వెళ్తున్న కారును స్పీడ్‌తో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకూతురు ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. వారం రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన దానిష్ ఇక్బాల్ భార్య నటాషా ఈ దుర్ఘటనకు పాల్పడింది. కారును ర్యాష్‌గా డ్రైవ్ చేయడమే కాకుండా.. బైకర్స్‌ను, పాదాచారులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకూతురుతోపాటే మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు.

ప్రమాదం చేసిన నటాషాను పోలీసులు అరెస్టు చేశారు. ఆ వెంటనే కోర్టులో హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని తీర్పునిచ్చింది.

ఈ హిట్ అండ్ రన్ కేసు కారణంగా వలీద్ సాహబ్ అనే వ్యక్తి కీలక నిర్ణయం తీసుకున్నాడు. కోర్టులో వచ్చిన తీర్పుతో తన కూతురి ప్రాణాలు కాపాడుకునేందుకు వినూత్నంగా ఆలోచించాడు. ఇందుకు తన కూతురి తలపై ఏకంగా సీసీ కెమెరా అమర్చి వార్తల్లో నిలిచాడు.

దీనిపై ఆ యువతిని ఆరా తీయగా.. ఆమె కీలక విషయాలే వెల్లడించింది. ఇటీవల కరాచీలో సంచలనం సృష్టించిన హిట్ అండ్ రన్ కేసు కారణంగానే తన తండ్రి ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పింది. ‘మీ తండ్రి ఇలా చేసిందుకు మీకు కోపం రాలేదా’ అని అడిగిన ప్రశ్నకు.. తన తండ్రి ఏ నిర్ణయం తీసుకున్నా అది తన మంచి కోసమేనంటూ సమాధానం చెప్పింది.