కొత్తగా ఆ నలుగురికి డీసీసీబీ ఛైర్మన్ గిరి.. జగన్ లెక్కలు అదుర్సు
రాష్ట్రం లోని 13 డీసీసీబీల ఇన్ ఛార్జి కమిటీల పదవీ కాలం మంగళవారం ముగిసింది. అందులోని తొమ్మిదింటిని కంటిన్యూ చేస్తూ నిర్ణయాన్ని తీసుకున్న సీఎం జగన్.
By: Tupaki Desk | 19 July 2023 5:27 AM GMTఅధికారంతో పాటు అసంతృప్తి మామూలే. అధికారం చేతి లో ఉన్నప్పుడు ఉన్నా కాసిన్ని పదవుల కోసం పోటీ పడే వారు పెద్ద సంఖ్యలో ఉంటారు. అందరికి సమాన అవకాశాలు ఇస్తూ.. ఎవరిని చిన్నబుచ్చకుండా చేయటం అంత తేలికైన విషయం కాదు. తనకు లభించే ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా అందరిని అసంతృప్తి పరిచే తీరు తనకు ఉందన్న సంకేతాల్ని అధినేత ఇవ్వటం అత్యంత కీలకం. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని చూసినప్పుడు.. ఆయన అనుసరించిన ఫార్ములాను చూస్తే.. ఈ విషయం పై మరింత క్లారిటీ ఖాయం.
రాష్ట్రం లోని 13 డీసీసీబీల ఇన్ ఛార్జి కమిటీల పదవీ కాలం మంగళవారం ముగిసింది. అందులోని తొమ్మిదింటిని కంటిన్యూ చేస్తూ నిర్ణయాన్ని తీసుకున్న సీఎం జగన్.. మరో నాలుగింటికి విషయం లో మాత్రం భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. దీనికి కారణం సమీకరణాల్లో చిక్కులు ఉండటమేనని చెబుతున్నారు. నలుగురికి పదవులు లభించేలా తీసుకున్న ఆయన నిర్ణయం ఆసక్తికరంగా మారింది. కొత్తగా నియమించిన వారి పదవీ కాలం ఆర్నెల్లు మాత్రమే ఉన్నప్పటికీ.. తనకు ఏ మాత్రం ఛాన్సు లభించినా.. అందరిని సంతృప్తి పరిచేందుకు తాను ప్రయత్నిస్తున్నానన్న సంకేతాల్ని ఇచ్చినట్లుగా చెప్పాలి.
విశాఖపట్నం లోని డీసీసీబీ ఛైర్ పర్సన్ గా ఉన్న చింతకాయల సన్యాసిపాత్రుడి భార్య అనిత స్థానం లో కోలా గురువుల కు ఛాన్సు ఇచ్చారు. ఇటీవల ఎమ్మెల్యేల కోటా లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిన ఆయన్ను వదిలేయకుండా.. తనను నమ్ముకున్న అతనికి తాజా పదవి తో ఊరట ను ఇచ్చారు. నర్సీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే సన్యాసిపాత్రుడికి గురువులుకి మధ్య సంబంధాలు సరిగా లేని వేళ.. సిట్టింగ్ ఎమ్మెల్యే భార్యకు పదవీ కాలం ముగిసిన వెంటనే ఆమెను తప్పించి.. గురువుల కు పదవి ని అప్పజెప్పటం ద్వారా.. సమతూకాన్ని పాటించినట్లుగా మారిందంటున్నారు.
ప్రకాశం జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పదవిని మారుతిప్రసాద్ రెడ్డికి ఇచ్చారు. ఇతను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఇటీవల కాలం లో చోటు చేసుకున్న పరిణామాల్లో బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ కు వ్యతిరేక వర్గంగా ఉన్న మారుతిప్రసాద్ బాలినేనికి అత్యంత ఆప్తుడు. ప్రస్తుతం పదవీ కాలం పూర్తైన మాదాసి వెంకయ్య కొండపి రేసు లో ఉన్నారు. ఈ సమయం లో బాలినేని సన్నిహితుడికి పదవిని కేటాయించటం ద్వారా.. అసంతృప్తి లెక్కలు సరి చేశారన్న మాట వినిపిస్తోంది.
కర్నూలు డీసీసీబీ ఛైర్ పర్సన్ పదవిని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సతీమణి విజయ మనోహరికి ఇచ్చారు. కర్నూలు టికెట్ పై మోహన్ రెడ్డికి.. స్థానిక ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు మధ్య పోటీ నెలకొన్న వేళ.. సర్దుబాటు లో భాగంగా ఎస్వీ మోహన్ రెడ్డి సతీమణికి పదవిని ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మరో పదవి (క్రిష్ణా డీసీసీబీ ఛైర్మన్)ని తన్నీరు నాగేశ్వరరావు స్థానంలో తాతినేని పద్మావతిని నియమిస్తూ నిర్ణయం తీసుకన్నారు. 2019 ఎన్నికల్లో చిలకలూరి పేట నియోజకవర్గంలో పార్టీ కోసం పని చేసిన ఆమెకు తాజా నిర్ణయంతో గుర్తింపు లభించినట్లైంది.