Begin typing your search above and press return to search.

విమానం టైరులో డెడ్ బాడీ... ఎలా వచ్చింది?

కజకిస్థాన్ లో అజర్ బైజన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ప్రమాదానికి గురై తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 Dec 2024 4:30 PM GMT
విమానం టైరులో డెడ్  బాడీ... ఎలా వచ్చింది?
X

కజకిస్థాన్ లో అజర్ బైజన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ప్రమాదానికి గురై తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. జే2-8243 అనే ఈ విమానం కుప్పకూలడంతో 38 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో విమానం టైరులో మృతదేహం కనిపించిన ఘటన తెరపైకి వచ్చింది.

అవును... విమానం టైరులో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడం తీవ్ర సంచలనంగా మారింది. అసలు ఆ మృతదేహం అక్కడకు ఎలా వచ్చిందనేది మిస్టరీగా మారిందని అంటున్నారు. విమానంలో అక్రమంగా ప్రయాణిస్తున్న వ్యక్తికి సంబంధించించిందా అనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... అమెరికాలో షికాగో లోని ఓహే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం హవాయి ద్వీపంలోని కహులుయీ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యింది. ఆ సమయంలో ఆ విమానం టైరులో ఓ మృతదేహాన్ని గుర్తించారు అధికారులు. దీంతో.. ఈ విషయం ఒక్కసారిగా కలకలం రేపింది.

ఈ సందర్భంగా స్పందించిన ఎయిర్ లైన్స్ ప్రతినిధి.. విమానం బయట నుంచి మాత్రమే ఎవరైనా వీల్ వెల్ లోకి వెళ్లగలరని.. అయితే, ఆ వ్యక్తి అక్కడకు ఎలా చేరాడనేది మాత్రం తెలియాల్సి ఉందని అన్నారు. ఇదే సమయంలో ఆ మృతదేహం ఎవరిదనేది తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిపారు.

ఇదే సమయంలో... చట్టవిరుద్ధంగా ప్రయాణించడానికి ప్రయత్నించే వ్యక్తులు ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు ఈ తరహా రిస్క్ చేస్తుంటారని యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ లైన్స్ ప్రతినిధి వెల్లడించారు. ఇలాంటి ప్రయత్నాలు చేసినవారు సజీవంగా బయటపడటం ఆల్ మోస్ట్ అసాధ్యం అని అంటున్నారు.

కాగా.. వీల్ వెల్ లో ఇరుకుగా ఉండటంతో ల్యాండింగ్ గేర్ వెనక్కి తిప్పినప్పుడు అందులో ఉన్న వ్యక్తి మరణించడానికి ఆస్కారం ఉంటుందని అంటారు. అయితే... గత ఏడాది ఓ వ్యక్తి ఇలాంటి పరిస్థితుల నుంచి బతికి బయటపడిన ఘటన ఫ్రాన్స్ లో చోటు చేసుకుని వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.