Begin typing your search above and press return to search.

పార్శిల్ లో మృతదేహం... మాస్క్ ధరించిన ఆ మహిళ ఎవరు?

ఆ పార్శిల్ లో మృతదేహంతో పాటు ఓ బెదిరింపు లేఖ కూడా ఉన్నట్లు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   23 Dec 2024 5:57 AM GMT
పార్శిల్  లో మృతదేహం... మాస్క్  ధరించిన ఆ మహిళ ఎవరు?
X

పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామానికి చెందిన సాగి తులసి గృహ నిర్మాణ సామాగ్రి పార్సిల్ పేరిట వచ్చిన చెక్క పెట్టెలో శవం బయటపడిన సంగతి తెలిసిందే. ఈ విషయం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. ఆ పార్శిల్ లో మృతదేహంతో పాటు ఓ బెదిరింపు లేఖ కూడా ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ వ్యవహారంపై పోలీసులు కీలకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా... తులసి మరిది శ్రీధర్ వర్మ అలియాస్ సుధీర్ వర్మ ను కీలక అనుమానితుడిగా భావిస్తుండగా.. అతడి ఆచూకీ నేటికీ తెలియలేదని అంటున్నారు. ఇదే సమయంలో... ఎరుపు రంగు కారులోంచి ముఖానికి మాస్క్ ధరించిన మహిళ ఎవరనే విషయంపై చర్చ జరుగుతుందని అంటున్నారు.

అవును... పార్శిల్ లో మృతదేహం వచ్చిన ఘటన జరిగిన రోజు (డిసెంబర్ 19) భీమవరం నుంచి తాడేపల్లిగూడెం మార్గంలో సాగిపాడు దగ్గర్లో ఎరుపూ రంగు కారులోంచి ముఖానికి మాస్క్ ధరించిన ఓ మహిళ దిగిందని.. అక్కడ నుంచే పిప్పరకు చెందిన ఆటోడ్రైవర్ తో.. ఆ పార్శిల్ ను యండగండి తీసుకెళ్లాలని కిరాయికి పురమాయించి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు.

దీంతో... ఎర్ర కారులో ముఖానికి మాస్కు ధరించిన మహిళ ఎవరు అనే విషయంపై పోలీసులు దృష్టిసారించారని అంటున్నారు.. ఈ సమయంలో ఆమె కారు ప్రయాణించిన రహదారిపై ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ని పోలీసులు పరిశీలిస్తున్నారని అంటున్నారు. దీంతో.. ఆమె ఎవరు అనేది తెలిస్తే.. విషయంపై క్లారిటీ రావొచ్చని అంటున్నారు.

మరోపక్క.. ఆ మృతదేహంతో కూడిన పార్శిల్ ఇంటికి చేరిన అనంతరం.. ఆమె మరిది శ్రీధర్ వర్మ పరరయ్యాడని.. అతడు కూడా ఎరుపురంగు కారులోనే పరారైనట్లు పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు. మరోవైపు ఆ మహిళతో శ్రీధర్ వర్మకు సన్నిహిత సంబంధం ఉన్నట్లు చెబుతున్నారని అంటున్నారు. దీంతో.. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఇక... ఆ మృతదేహానికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్ ను పరిశీలిస్తే... అతడిని హత్య చేసినట్లుగా తేలిందని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా కేసు పురోగతిపై ఐజీ అశోక్ కుమార్ భీమవరంలోని ఎస్పీ కార్యాలయంలో సమీక్షించారు. మరోవైపు ఆ మృతదేహం ఎవరిదనేది గుర్తుపట్టడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు.