Begin typing your search above and press return to search.

ఈ కండిషన్స్ తో హమాస్‌ - ఇజ్రాయెల్‌ మధ్య ఒప్పందం?

హమాస్ పై తాము చేసే దాడులు తమ శత్రుదేశాలు దశాబ్ధాలపాటు గుర్తుంచుకునేలా ఉంటాయని ఆ దేశ అధ్యక్షుడు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 Nov 2023 2:03 PM GMT
ఈ కండిషన్స్  తో హమాస్‌ - ఇజ్రాయెల్‌  మధ్య ఒప్పందం?
X

తమ పౌరులపై హమాస్ మిలిటెంట్లు చేసిన విచక్షణారాహిత ఊచకోతతో ఇజ్రాయేల్ గాజాను గడగడలాడించేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... హమాస్‌ ను పూర్తిగా అంతమొందించడమే లక్ష్యంగా గాజాపై విరుచుకుపడుతోంది. హమాస్ పై తాము చేసే దాడులు తమ శత్రుదేశాలు దశాబ్ధాలపాటు గుర్తుంచుకునేలా ఉంటాయని ఆ దేశ అధ్యక్షుడు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆ స్టేట్ మెంట్ కి న్యాయంచేస్తూ ఇజ్రాయేల్ సైన్యం పెర్ఫార్మెన్స్ చేస్తుంది. ప్రస్తుతం భూతల దాడులతో దక్షిణాగాజాపై విరుచుకుపడుతుంది. దీంతో అక్కడి ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. హమాస్‌ చేతిలో బందీలను విడిపించేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. ఈ సమయంలో కాల్పుల విరమణ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుందని అమెరికా మీడియా చెబుతుంది.

అవును... హమాస్‌- ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణకు, బందీల అప్పగింతకు సంబంధించి కీలక ఒప్పందం కుదిరినట్లు "ది వాషింగ్టన్‌ పోస్టు" కథనం ప్రచురించింది. ఇందులో భాగంగా... తమ వద్ద బందీలుగా ఉన్న అమెరికా పౌరులతో సహా 50 మందిని విడుదల చేసేందుకు హమాస్‌ అంగీకరించినట్లు పేర్కొంది. దీంతో అవిరామంగా కొనసాగుతున్న యుద్ధానికి ఇజ్రాయెల్‌ కాస్త విరామం ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

తాజాగా ఆ పత్రిక తన కథనంలో మరిన్ని కీలక విషయాలు వెల్లడించింది. ఇందులో భాగంగా... అమెరికా, ఖతార్‌ మధ్యవర్తిత్వంలో దోహాలో ఈమేరకు చర్చలు జరిగాయని.. దీంతో ఇజ్రాయేల్ – హమాస్ మధ్య సుమారు ఆరు పేజీల ఒప్పందం కుదిరినట్లు కథనంలో పేర్కొంది.

ఈ ఆరుపేజీల ఒప్పందంలో పౌరులకు ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు ఐదు రోజుల పాటు ఇజ్రాయేల్ కాల్పుల విరమణ అమలు చేసే అవకాశం ఉందని తెలిపింది. ఇదే సమయంలో వాషింగ్టన్‌ లోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయ ప్రతినిధి ఈ ఒప్పందంపై మాట్లాడేందుకు నిరాకరించినట్లు పేర్కొంది.

తోసిపుచ్చిన వైట్ హౌస్:

అమెరికా పత్రికల కథనాలు అలా ఉంటే... మరోపక్క ఇజ్రాయెల్‌ - హమాస్‌ లు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకారం కుదిరినట్లు వస్తున్న వార్తలను వైట్‌ హౌస్‌ తోసిపుచ్చింది. ఆ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ... ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదని శ్వేత సౌధం జాతీయ భద్రతా మండలి ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ ఓ ప్రకటనలో తెలిపారు.

కాగా... అక్టోబరు 7న ఇజ్రాయెల్‌ పై హమాస్ జరిగిన మెరుపు దాడిలో సుమారు 1200 మంది చనిపోగా.. 240 మంది పౌరులను హమాస్‌ బందీలుగా చేసుకొంది. వీరిలో అమెరికా పౌరులు కూడా ఉన్నారు. దీంతో ఆ బందీలను విడిపించుకునేందుకు గాజాలో భూతల దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయేల్ సైన్యం గాజాను వణికించేస్తుంది.