Begin typing your search above and press return to search.

అంతిమ ఘడియను చెప్పే యాప్... "డెత్ క్లాక్" గురించి తెలుసా?

అయితే... మనుషుల ఆరోగ్య స్థితిగతుల ఆధారంగా వారి అంతిమ గడియను చెప్పే యాప్ ఒకటి ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   11 Dec 2024 9:30 PM GMT
అంతిమ ఘడియను చెప్పే యాప్...  డెత్  క్లాక్ గురించి తెలుసా?
X

ఓ మనిషి ఎప్పుడు మరణిస్తాడో మామూలుగా ఉన్నప్పుడు భూమి మీద ఉన్న వారేవరూ చెప్పలేరని.. ఆస్పత్రిలో పరిస్థితి సీరియస్ గా ఉంటే మాత్రం వైద్యులు మాత్రమే చెప్పగలరని అంటారు. అయితే... మనుషుల ఆరోగ్య స్థితిగతుల ఆధారంగా వారి అంతిమ గడియను చెప్పే యాప్ ఒకటి ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.

అవును... గూగుల్ ప్లేస్టోర్ తో పాటు యాపిల్ స్టోర్ లోనూ ఓ యాప్ ఇప్పుడు హల్ చల్ చేస్తోందని అంటున్నారు. "డెత్ కాక్" అని పిలుస్తున్న ఈ యాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేస్తుందని చెబుతున్నారు. అలా అని ఇదేదో ఆషామాషీ వ్యవహారం కాదు సుమా.. పక్కా పెర్ ఫెక్ట్ అని అంటున్నారు!

సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెషన్ (సీడీసీ) అధికారిక డేటాతోపాటు 5.3 కోట్ల మంది భాగస్వాములైన 1,200 అంతర్జాతీయ అధ్యయనాలను పరిశీలించి మరీ మరణం తేదీని అంచనా వేస్తుందని చెబుతున్నారు. ఈ అంచనా కోసం.. శరీరంలోని బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ తో పాటు ఆహారపు అలవాట్లు, వ్యాయామం మొదలైన విషయాలను పరిగణలోకి తీసుకుంటుందని అంటున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన యాప్ డెవలపర్ బ్రెంట్ ఫ్రాన్సన్... మరణ తేదీ చెప్పి ప్రజలను భయపెట్టడం తమ ఉద్దేశ్యం కాదని.. వారి ఆరోగ్య స్థితిగతులపై కచ్చితమైన అవగాహన కల్పించాలని అనుకుంటున్నామని.. హెల్త్, ఇన్సూరెన్స్ సంస్థల నుంచి సేకరించిన ఆయుఃప్రమాణాలతో పాటు ఏఐ ఆల్గారిథంస్ ను క్రోడీకరించాకే చావు తేదీని లెక్కిస్తుందని అన్నారు.

ఇదే సమయంలో.. మరణానికి ఎంత దూరంలో ఉన్నారో చెప్పడమే కాకుండా... ఆ డేటా ఆధారంగా హెల్త్ టిప్స్ కూడా ఇస్తుందని అంటున్నారు. మరోపక్క... డెత్ డేట్ సంగతి కాసేపు పక్కనపెడితే.. హెల్త్ విషయంలో హెచ్చరికలు చేస్తూ, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతుందని నెటిజన్లు కామెట్స్ చేస్తున్నారు. ఈ యాప్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఈ యాప్ ను మొదట మూడు రోజులూ ఉచితంగా వాడుకునే అవకాశం ఇస్తున్నరు. ఈ ట్రయల్ పిరియడ్ ముగిసిన తర్వాత.. నెలవారీ, లేదా.. ఏడాది చొప్పున సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఐతే ఈ డెత్ క్లాక్ యాప్ ఇంకా భారత్ లో అందుబాటులోకి రాలేదు కానీ.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 1.20 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని అంటున్నారు.