Begin typing your search above and press return to search.

అక్కడ రే*ప్ చేస్తే తలలో బుల్లెట్ దిగుద్ది!.. ఏ దేశాల్లో ఏ శిక్ష అంటే..?

మనదేశంలో ఎంత ఘోరమైన నేరం చేసినా ఉరిశిక్ష విధించే అవకాశం చాలా తక్కువ! అతికొన్ని సందర్భాల్లో మాత్రమే ఉరిశిక్షను అమలు చేస్తారు

By:  Tupaki Desk   |   20 Aug 2024 9:30 AM GMT
అక్కడ రే*ప్ చేస్తే తలలో బుల్లెట్ దిగుద్ది!.. ఏ దేశాల్లో ఏ శిక్ష అంటే..?
X

మనదేశంలో ఎంత ఘోరమైన నేరం చేసినా ఉరిశిక్ష విధించే అవకాశం చాలా తక్కువ! అతికొన్ని సందర్భాల్లో మాత్రమే ఉరిశిక్షను అమలు చేస్తారు. దీన్ని ఆసరాగా చేసుకొని చాలా మంది ఏమాత్రం భయం లేకుండా మహిళపై వికృత చేష్టలకు దిగుతున్నారనే ఆరోపణ ఉంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో 2012 డిసెంబర్ లో ఓ యువతిని అత్యంత దారుణంగా, అత్యంత ఘోరంగా అత్యాచారం చేసి, ఆమె మృతికి కారణమయ్యారు కొంతమంది మృగాళ్లు!

ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం "నిర్భయ" చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఆ చట్టం అమలులోకి వచ్చి దశాబ్ధ కాలం దాటింది. ఎన్ని చట్టాలు వచ్చినా.. రే*ప్ చేస్తే మహా అయితే జైల్లో వేస్తారనే చులకన భావం కొంతమందిలో వచ్చేసిందని, అందువల్లే రెచ్చిపోతున్నారని అంటున్నారు. అలా కాకుండా రే*ప్ చేస్తే.. అంగం కోస్తారు.. తల తీస్తారు.. ఉరి వేస్తారు.. అనే భయం ఉంటే తప్ప మృగాళ్లలో మార్పు రాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల కోల్ కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం చేశారు! ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేశారనే విషయం తెరపైకి రావడంతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. ఈ విషయంపై వైద్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారికి అంతా తోడు నిలిస్తున్నారు. ఈ సమయంలో నిందితుడికి ఉరిశిక్ష విధించాలని అంతా డిమాండ్ చేస్తున్నారు.

ఈ సమయంలో... అత్యంత కఠినమైన శిక్షలు విధించే దేశాలేవో ఇప్పుడు చూద్దాం...!

పాకిస్థాన్: సామూహిక అత్యాచారం, పిల్లలపై అత్యాచారం కేసులలో పాకిస్థాన్ లో మరణశిక్ష విధిస్తారు. మహిళలపై దాడులకు దిగి, వారి అవయువాలు కనిపించేలా చేసినా కూడా మరణశిక్షే విధిస్తారు.

ఆఫ్గనిస్తాన్: ఈ దేశంలో అత్యాచార కేసులో నిందితులకు 4 రోజుల్లోనే శిక్ష అమలుచేస్తారు. కొన్ని సందర్భాల్లో బాధితుల ద్వారానే నిందితుల్ని శిక్ష విధిస్తారు. ఇందులో భాగంగా తుపాకితో తలపై కాల్చడం లేదా బహిరంగంగా ఉరి తీస్తారు.

ఉత్తర కొరియా: నియంత కిమ్ జాంగ్ ఉన్ పాలనలో ఉన్న ఈ దేశంలో అత్యాచారానికి పాల్పడితే తుపాకీతో కాల్చి చంపుతారు. కొన్ని సర్లు తలపై కూడా కాలుస్తారు. వాస్తవానికి ఇక్కడ శిక్ష అంటే అది దాదాపుగా మరణశిఖ అనే భావించాలి!

సౌదీ అరేబియా: అత్యాచార కేసుల్లో నిందిస్తులకు ఈ దేశంలో మత్తు మందు ఇచ్చి బహిరంగంగా తల తీసేస్తారు. కొన్ని సందర్భాల్లో రాళ్లతో కొట్టి చంపుతారు. చాలా అరుదైన సందర్భాల్లో బాధితుల అనుమతితో మరణశిక్షను రద్దు చేసే అవకాశం ఉంటుంది.

ఇరాన్: ఇక్కడ కూడా అత్యాచార నిందితులకు బహిరంగంగానే ఉరి శిక్ష లేదా తుపాకీతో కాల్చడం వంటి శిక్షలు విధిస్తారు. కొన్ని సందర్భాల్లో బాధితుల అనూంతితో ఒక్కోసారి మరణశిక్ష రద్దు చేస్తారు. అలాంటప్పుడు మాత్రం 100 కొరడా దెబ్బలు కొడతారు.

యూఏఈ, ఈజిప్ట్: ఈ రెండు చోట్లా అత్యాచార కేసుల్లో నిందితులకు 7 రోజుల్లోనే మరణశిక్ష అమలు చేస్తారు.

చైనా: ఇక్కడ కూడా అత్యాచారాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో విచారణ వీలైనంత వేగంగా పూర్తిచేసి దోషుల్ని శిక్షిస్తారు. తుపాకీతో కాల్చడం లేదా పురుషాంగాన్ని తొలగించే శిక్షని అమలుచేస్తుంటారు.