Begin typing your search above and press return to search.

ఆగం కావొద్దు.. ఆ సమాచారం తప్పు.. తేల్చేసిన ఆర్ బీఐ

అలాంటి తీరుకు నిలువెత్తు రూపంగా ఒక తప్పుడు సమాచారం పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతోంది.

By:  Tupaki Desk   |   21 Jan 2025 6:30 AM GMT
ఆగం కావొద్దు.. ఆ సమాచారం తప్పు.. తేల్చేసిన ఆర్ బీఐ
X

ఇప్పుడు నడుస్తున్నదంతా సోషల్ మీడియా.. వాట్సాప్ వర్సిటీ రోజులు. అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేయటం.. నిజం సైతం తన గురించి తాను సందేహానికి గురయ్యేలా చేయటం ఇటీవల రోజుల్లో మామూలైంది. తప్పుడు వార్తల్ని పక్కా నిజాలుగా ప్రచారం చేసేలా చేస్తున్నారు. ఇందుకు.. అందివచ్చిన సాంకేతికతను విచ్చల విడిగా వాడేస్తున్నారు. అలాంటి తీరుకు నిలువెత్తు రూపంగా ఒక తప్పుడు సమాచారం పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతోంది. సింఫుల్ గా ఈ తప్పుడు సమాచారాన్ని సింగిల్ లైన్ లో చెబితే.. ‘బ్లాక్ ఇంక్ తో రాసే చెక్కులు చెల్లవు. అదీ.. ఈ కొత్త సంవత్సరం నుంచి’.

ఈ సమాచారాన్ని పేరున్న మీడియాసంస్థ వార్తగా ప్రచురించినట్లుగా కలరింగ్ ఇచ్చి.. సర్క్యులేట్ చేస్తున్నారు. అది కూడా రిజర్వు బ్యాంక్ ఇండియా నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు. పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న ఈ సమాచారంపై తాజాగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం దీనిపై సోషల్ మీడియాలో ఒక పోస్టు చేసింది.

‘కొత్త ఏడాదిలో కొత్త నిబంధన. నలుపు సిరాతో రాసే చెక్కులు చెల్లుబాటు కావు. ఆర్ బీఐ కొత్త నిబంధన తీసుకొచ్చింది’ అంటూ వైరల్ అవుతున్న పోస్టులో ఏ మాత్రం నిజం లేదని తేల్చేసింది. సామాన్యులను కన్ఫ్యూజన్ కు గురి చేస్తున్న ఈ పోస్టు మీద స్పందించిన కేంద్రం.. ఇదేమాత్రం నిజం కాదని తేల్చి చెప్పింది. ఈ తరహా మార్గదర్శకాల్ని ఆర్ బీఐ ఎప్పుడూ జారీ చేయలేదని స్పష్టం చేసింది. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లుగా ఈ తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టేందుకు సోషల్ మీడియాను ఎంపిక చేసుకోవటం గమనార్హం.