Begin typing your search above and press return to search.

బన్నీ రాకముందు నార్మల్ గానే ఉంది... మృతురాలి భర్త కీలక వ్యాఖ్యలు!

ఈ క్రమంలో పుష్ప-2 బినిఫెట్ షో కోసం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్దకు బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు.

By:  Tupaki Desk   |   5 Dec 2024 8:03 AM GMT
బన్నీ రాకముందు నార్మల్  గానే ఉంది... మృతురాలి భర్త కీలక వ్యాఖ్యలు!
X

సినిమా హాళ్ల వద్ద "పుష్ప-2" సందడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పుష్ప-2 బినిఫెట్ షో కోసం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్దకు బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఈ ఘటనపై తాజాగా మృతురాలి భర్త భాస్కర్ స్పందించారు.

అవును... ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్దకు బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలో ఆమె భర్త భాస్కర్ స్పందించారు. అసలు రాత్రి సినిమా హాల్ వద్ద ఏమి జరిగింది.. ఎలా జరిగిందనే విషయాలు వెల్లడించారు.

ఇందులో భాగంగా... తమ బాబు అల్లు అర్జున్ ఫ్యాన్ అని.. అతడిని అందరూ పుష్పా అని పిలుస్తారని..అందుకోసమే మేము సినిమాకు వచ్చామని.. అయితే, ఇలా తొక్కిసలాటలో తన భార్యను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నట్లు తెలిపారు. పోలీసులు సీపీఆర్ చేసినప్పుడు తమ బాబు సృహలోకి వచ్చాడని అన్నారు.

దీంతో... వెంటనే బాబును ఆస్పత్రికి తరలించారని తెలిపారు. సినిమా హాలు వద్ద తన భార్య, పిల్లలు మొదట లోపలికి వెళ్లారని.. అప్పటికి అభిమానులు మామూలుగానే ఉన్నారని.. ఎప్పుడైతే అల్లూ అర్జున్ వచ్చారో ఒక్కసారిగా క్రౌడ్ పెరిగిపోయిందని.. తొక్కిసలాట జరిగిందని అన్నారు. తమ బాబు పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెప్పారని భాస్కర్ వెల్లడించారు.

ఇదే సమయంలో... ఈ ఘటనపై వెంటనే అల్లు అర్జున్ స్పందించాలని.. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని భాస్కర్ బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో... సంధ్య థియేటర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాలని పిటిషన్:!

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్దకు బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన విషయం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశం అవుతున్న వేళ.. అల్లు అర్జున్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్.హెచ్.ఆర్.సీ)లో పిటిషన్ వేశారు.

ఇందులో భాగంగా... అల్లు అర్జున్ పై కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. జరిగిన దారుణానికి అల్లు అర్జున్, పోలీసులు, నిర్మాతలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడంతోపాటు మృతురాలి కుటుంబానికి రూ.10 కోట్ల పరిహారం ఇప్పించాలని కోరారు.