Begin typing your search above and press return to search.

మోడీ డీప్ ఫేక్ వీడియో...అది తానే అంటున్న వికాస్ మహంతే!

ప్రస్తుతం ఆన్ లైన్ వేదికగా ఏ వీడియో చూసినా, ఏ ఫోటో చూసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి మొదలైపోయిందన్నా అతిశయోక్తి కాదేమో

By:  Tupaki Desk   |   23 Nov 2023 8:41 AM GMT
మోడీ డీప్ ఫేక్ వీడియో...అది తానే అంటున్న వికాస్ మహంతే!
X

ప్రస్తుతం ఆన్ లైన్ వేదికగా ఏ వీడియో చూసినా, ఏ ఫోటో చూసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి మొదలైపోయిందన్నా అతిశయోక్తి కాదేమో. సినిమా సెలబ్రెటీలు, క్రికెట్ సెలబ్రెటీల పిల్లలు, రాజకీయ నాయకులు ఇప్పుడు ఈ డీప్ ఫేక్ టెన్షన్ తో కొట్టిమిట్టాడుతున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో కొన్ని రోజుల క్రితం ప్రధాని మోడీ కూడా "డీప్‌ ఫేక్‌"పై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆ విడియోలో ఉన్నది మోడీ కాదని.. అది తన వీడియో అని ఒక వ్యక్తి ముందుకొచ్చాడు!

అవును... గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాల్లో సినీ తారలు, సెలబ్రెటీల డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ సమయంలో కొన్ని రోజుల క్రితం ప్రధాని మోడీ కి సంబంధించిన ఒక వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో ప్రధాని మోడీ గార్బా ఆడినట్టుగా ఉంది. దీంతో అది వైరల్ గా మారింది. దీంతో... ఆ వీడియోలో కనిపిస్తున్నది తానే అంటూ ఓ వ్యక్తి ఇన్‌ స్టాగ్రాంలో పోస్టు పెట్టారు.

ఇందులో భాగంగా... "ఇటీవల ప్రధాని మోడీ డీప్‌ ఫేక్ పై ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. మీకో విషయం తెలియజేయాలనుకుంటున్నాను" అంటూ మొదలుపెట్టిన వికాస్ మహంతే అనే వ్యక్తి... ఆ వీడియోలో కనిపిస్తోన్న వ్యక్తిని తానే.. అని అతని పేరు వికాస్ మహంతే అని.. అది డీప్‌ ఫేక్ వీడియో కాదని.. తాను ఓ కళాకారుడిని అని రాసుకొచ్చాడు.

ఇదే సమయంలో... తనకు ప్రధాని మోడీతో పోలికలు ఉన్నందున అనేక మంది పలు కార్యక్రమాలకు ఆహ్వానిస్తుంటారని.. ఎట్టిపరిస్థితుల్లోనూ తాను ప్రధాని ప్రతిష్ఠను దిగజార్చే పనులు చేయనని వివరణ ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ కూడా వైరల్ అవుతుంది. అయితే... వికాస్ ముంబయికి చెందిన వ్యాపారవేత్త అని తెలుస్తోంది.

కాగా... ఇటీవల నటి రష్మికకు చెందిన ఓ డీప్‌ ఫేక్‌ వీడియో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాలీవుడ్‌ నటీమణులు కాజోల్‌, కత్రినా కైఫ్‌ లకు సంబంధించిన డీప్‌ ఫేక్‌ వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ విషయాలపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం.. కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... త్వరలో దీనిపై కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు.