Begin typing your search above and press return to search.

డీఫ్ ఫేక్ వీడియోలకు చెక్... యూట్యూబ్ లో సరికొత్త ఫీచర్!

అవును... తమ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాం లో వచ్చే డీప్ ఫేక్ కంటెంట్ ను అరికట్టడంలో భాగంగా యుట్యూబ్ ఓ ముందడుగు వేసింది.

By:  Tupaki Desk   |   23 Jun 2024 4:23 AM GMT
డీఫ్  ఫేక్  వీడియోలకు  చెక్... యూట్యూబ్  లో సరికొత్త ఫీచర్!
X

ప్రస్తుతం డీప్ ఫేక్ అనే విషయం ఎంత పెద్ద సమస్యగా మారుతుందనేది తెలిసిన విషయమే. మొదట్లో పలువురు సెలబ్రెటీలు ఈ డీప్ ఫేక్ బారిన పడగా.. తర్వాత కాలంలో వారి పేరు చెప్పి ప్రజలను మోసం చేసే కార్యక్రమాలకూ తెరలేచింది. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం అన్ని రంగాల్లోనూ పెరిగిపోవడంతో దుర్వినియోగమూ ఎక్కువవుతుంది!

దాదాపుగా ప్రతీ రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ విస్తరిస్తుండటంతో దీన్ని చాలా మంది దుర్వినియోగం చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ సమయంలో దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. దొరికిన వారికి కఠిన శిక్షలు అమలు కన్ ఫాం అని అంటున్నారు. ఈ సమయంలో యూట్యూబ్ ఒక ముందడుగు వేసింది.

అవును... తమ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాం లో వచ్చే డీప్ ఫేక్ కంటెంట్ ను అరికట్టడంలో భాగంగా యుట్యూబ్ ఓ ముందడుగు వేసింది. కొంతమంది కంటెంట్ క్రియేటర్లు తమ ఫాలోవర్స్ ని ఆకట్టుకోవడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా... ఇలా డీఫ్ పేక్ కి పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నా నేపథ్యంలో... ఒక పరిష్కారాన్ని తెరపైకి తెచ్చింది.

ఇటీవల కాలంలో యూట్యూబ్ లో వస్తున్న పలు వీడియోల్లో ఏది నిజమైనదో, ఏది ఏఐ సాయంతో రూపొందించిందో తెలుసుకోలేక యూజర్స్ తికమకపడుతున్నారు. పలువురు సెలబ్రెటీల వాయిస్ ని ఉపయోగించి రూపొందిస్తున్న కంటెంట్ మరింత కన్ ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. దీనికి చెక్ పెట్టేందుకు యూట్యూబ్ సరికొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది.

ఇందులో భాగంగా... కంటెంట్ క్రియేటర్లు తమ వీడియోల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగిస్తుంటే.. ఆ విషయాని యూజర్లకు స్పష్టం తెలియాజేయాలని పేర్కొంది. ఆ వివరణ లేకుండా వీడియో విడుదల చేస్తే వినియోగదారులు వీటిపై రిపోర్ట్ చేయొచ్చు. వీటిని గుర్తించడానికి తాజాగా మరికొన్ని ఫీచర్లను జోడించింది.

ఈ నేపథ్యంలో... ఇకపై యూట్యూబ్ లో మీ ఫోటో, వాయిస్ ను ఉపయోగించిన కంటెంట్ కనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయవచ్చు. ఇలా రిపోర్ట్ చేసిన అనంతరం... ఈ వీడియోలను పరిశీలించి.. ధృవీకరించి.. సదరు వీడియోలను యూట్యూబ్ తొలగిస్తుంది. దీంతో.. వినియోగదారులు డీప్ ఫేక్ వీడియోలను అరికట్టవచ్చని యూట్యూబ్ సంస్థ పేర్కొంది.