Begin typing your search above and press return to search.

పవన్‌ పై క్రిమినల్‌ డిఫమేషన్‌ కేసులో కీలక అప్ డేట్ ఇదే!

ఇందులో భాగంగా పవన్‌ కేసు ఫైల్‌ చేసిన వాలంటీర్‌ స్టేట్‌ మెంట్‌ ను న్యాయమూర్తి రికార్డ్ చేశారు.

By:  Tupaki Desk   |   18 Aug 2023 12:01 PM GMT
పవన్‌  పై క్రిమినల్‌  డిఫమేషన్‌  కేసులో కీలక అప్  డేట్  ఇదే!
X

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు సృష్టించిన ప్రకంపనలు సంగతి తెలిసిందే. ఈ సమయంలో విజయవాడ సివిల్‌ కోర్టులో క్రిమినల్‌ డిఫమేషన్‌ కేసు దాఖలైన సంగతీ తెలిసిందే. ఈ క్రమంలో పవన్‌ కేసు ఫైల్‌ చేసిన వాలంటీర్‌ స్టేట్‌ మెంట్‌ ను శుక్రవారం జడ్జి రికార్డు చేశారు.

అవును.. వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటు... విజయవాడ సివిల్‌ కోర్టులో పవన్ కల్యాణ్ పై వేసిన క్రిమినల్‌ డిఫమేషన్‌ కేసుకు సంబందించి కీలక పరిణామం జరిగింది. ఇందులో భాగంగా పవన్‌ కేసు ఫైల్‌ చేసిన వాలంటీర్‌ స్టేట్‌ మెంట్‌ ను న్యాయమూర్తి రికార్డ్ చేశారు.

వాలంటీర్లపై పవన్‌ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మానసిక వేదనకు గురైయానని, న్యాయం చేయాలని మహిళా వాలంటీర్‌ కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో వాలంటీర్‌ తరఫున న్యాయవాదులు కేసు దాఖలు చేశారు. ఇందులో భాగంగా... సెక్షన్ 499, 500, 504, 505 ప్రకారం కేసు దాఖలు చేశారు.

ఈ పిటిషన్ వేసిన సందర్భంగా తమకు న్యాయం చేయాలని మహిళా వాలంటీర్‌ కోరారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్‌ కళ్యాణ్‌ పై చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. పవన్ తమపై చేసిన తప్పుడు ఆరోపణలు తీవ్రంగా బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే క్రమంలో... తను భర్త చనిపోవడంతో పిల్లలతో కలిసి ఒంటరిగా జీవిస్తున్నట్లు మహిళా వాలంటీర్ చెప్పుకొచ్చారు. వాలంటీర్ ఉద్యోగంతోనే తాను జీవితాన్ని నెట్టుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమయంలో పవన్ వ్యాఖ్యల ప్రభావంతో తనను చుట్టుపక్కల వారు ఉమెన్ ట్రాఫికింగ్ అంశంపై ప్రశ్నిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

నిస్వార్థంగా సేవ చేస్తున్న తమపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిందలు వేశారని.. ఆయనపై చట్టపరంగా శిక్షించాలని మహిళా వాలంటీర్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి... ఈ మేరకు సదరు వాలంటీర్‌ స్టేట్‌ మెంట్‌ ను రికార్డు చేశారు.