Begin typing your search above and press return to search.

ఏడాదిలో భారీగా డిలీట్ చేసిన యాప్ లు ఇవే!

ఇదంతా ఒక లెక్క అయితే.. ఈ ఏడాదిలో అత్యధికంగా డిలీట్ చేసిన యాప్ ల జాబితా ఆసక్తికరంగా మారింది

By:  Tupaki Desk   |   26 Dec 2023 4:59 AM GMT
ఏడాదిలో భారీగా డిలీట్ చేసిన యాప్ లు ఇవే!
X

అరచేతి అద్భుతంగా మారిన స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ కావటమే కాదు.. ఇప్పుడున్న ఫోన్లు మొత్తం కలిపితే ప్రపంచ జనాభా కంటే ఎక్కువగా ఉండటంతెలిసిందే. స్మార్ట్ ఫోన్లలో ప్రతి ఒక్కరు వినియోగించే యాప్ లకు సంబంధించి ఆసక్తికర డేటా బయటకు వచ్చింది. స్మార్ట్ ఫోన్ ను వినియోగించేందుకు యాప్ లు అవసరం తప్పనిసరి. ఈ యాప్ లో సోషల్ మీడియా యాప్ లేని ఫోన్ అన్నది దాదాపుగా ఉండదనే చెప్పాలి.

అంతలా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న యాప్ లకు సంబంధించి.. ఈ ఏడాదిలో అత్యధికంగా డిలీట్ అయిన యాప్ లకు సంబంధించిన లెక్కలు ఆసక్తికరంగా మారాయి. ఒక నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య అక్షరాల 480 కోట్ల మంది. అంటే.. ప్రపంచ జనాభా కంటే ఎక్కువన్న మాట. అంతేకాదు.. ప్రపంచ వ్యాప్తంగా చాలామంది సోషల్ మీడియాను వినియోగిస్తున్న వారు రోజులో సరాసరిన 2.24 గంటల పాటు కేటాయిస్తున్నట్లుగా తేల్చారు.

ఇదంతా ఒక లెక్క అయితే.. ఈ ఏడాదిలో అత్యధికంగా డిలీట్ చేసిన యాప్ ల జాబితా ఆసక్తికరంగా మారింది. అమెరికాకు చెందిన టెక్ సంస్థ టీఆర్ జీ డేటా సెంటర్ రిపోర్టు ప్రకారం.. యూజర్లకు అందుబాటులోకి వచ్చిన 24 గంటల వ్యవధిలో వంద కోట్ల మంది వినియోగదారులను సంపాదించిన మెటాకు చెందిన త్రెడ్ యాప్. అయితే.. ఈ యాప్ అందుబాటులోకి వచ్చిన ఐదు రోజుల వ్యవధిలోనే తనకు చెందిన 80 శాతంమంది వినియోగదారుల్ని కోల్పోయినట్లుగా పేర్కొంది.

ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. ఇప్పటి యూత్ అమితంగా వినియోగించే ఇన్ స్టాకు సంబంధించి దాదాపు 10 లక్షల మంది యూజర్స్ ఇంటర్నెట్ లో తమ ఇన్ స్టా ఖాతాను డిలీట్ చేయటం ఎలా అన్న దాని కోసం వెతికినట్లుగా గుర్తించారు. ఏడాది వ్యవధిలో ఇన్ స్టాగ్రామ్ ను 10.20లక్షల మంది వినియోగదారులు డిలీట్ చేశారు. అత్యధికంగా డిలీట్ చేసిన రెండో యాప్ స్నాప్ చాట్ ఉంది. దీన్ని 1.28 లక్షల మంది.. మూడో స్థానంలో ఎక్స్ (ట్విటర్).. నాలుగో స్థానంలో టెలిగ్రామ్.. ఐదో స్థానంలో ఫేక్ బుక్ ఉంది. తర్వాతి స్థానాల్లో టిక్ టాక్.. యూట్యూబ్.. వాట్సాప్.. విచాట్ లాంటివి ఉన్నాయి. ఇంకో విషయం ఏమంటే ఈ ఏడాది వ్యవధిలో ఫేస్ బుక్ ను 49 వేల మంది డిలీట్ చేస్తే.. వాట్సాప్ ను 4950 మంది డిలీట్ చేసినట్లుగా గుర్తించారు.