Begin typing your search above and press return to search.

ఢిల్లీ సెగ‌లు: మోడీ ప్ర‌చారం ముగిసింది.. కేజ్రీవాల్‌కు దిమ్మ‌తిరిగింది! షాకింగ్ ప‌రిణామం

అనంత‌రం.. వేర్వేరుగా.. స‌ద‌రు ఏడుగురు ఎమ్మెల్యేలు బ‌హిరంగ లేఖ‌లు రాశారు.

By:  Tupaki Desk   |   31 Jan 2025 2:31 PM GMT
ఢిల్లీ సెగ‌లు:  మోడీ ప్ర‌చారం ముగిసింది.. కేజ్రీవాల్‌కు దిమ్మ‌తిరిగింది! షాకింగ్ ప‌రిణామం
X

ఖ‌చ్చితంగా మ‌రో నాలుగు రోజుల్లో కీల‌క‌మైన అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. పైగా.. తాడో పేడో తేల్చుకునేందుకు కీల‌క పార్టీల‌న్నీ ఎన్నిక‌ల‌ యుద్ధంలో అలుపెరుగ‌ని పోరు సాగిస్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో అండ‌గా ఉండి.. పార్టీని గెలిపించాల్సి న అధికార‌పార్టీ ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేలు ఏడుగురు హ్యాండిచ్చేశారు. త‌మ త‌మ ఎమ్మెల్యే ప‌ద‌వుల‌కు శుక్ర‌వారం రాత్రి అనూ హ్యంగా రాజీనామాలు స‌మ‌ర్పించారు. త‌క్ష‌ణం ఆమోదించాల‌ని స్పీక‌ర్‌ను విన్న‌వించారు. అనంత‌రం.. వేర్వేరుగా.. స‌ద‌రు ఏడుగురు ఎమ్మెల్యేలు బ‌హిరంగ లేఖ‌లు రాశారు.

మోడీ ఇలా వెళ్ల‌గానే..

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ శుక్ర‌వారం సాయంత్రం 3 గంట‌ల స‌మ‌యంలో ఢిల్లీలోని ద్వార‌క‌లో ప‌ర్య‌టించారు. ఎన్నిక‌ల ప్ర‌చారం చేశారు. బీజేపీ అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు విన్న‌వించారు. అంతేకాదు.. ఈ సంద‌ర్భంగా మాజీ సీఎం, ఆప్ క‌న్వీన‌ర్‌పై నిప్పులు చెరిగారు. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీని గెలిపిస్తే.. కేజ్రీవాల్ అవినీతి సామ్రాజ్యాన్ని కూక‌టి వేళ్ల‌తో స‌హా పెక‌లించి వేస్తామ‌ని, పేద‌ల‌కు ఇళ్లు క‌ట్టించి ఇస్తామ‌ని చెప్పారు. అనంత‌రం.. 6 గంట‌ల స‌మ‌యంలో ఆయ‌న ప‌ర్య‌ట‌న ముగించుకుని త‌న అధికారిక‌ నివాసానికి వెళ్లిపోయారు.

అంతే.. మ‌రో అర‌గంట గ‌డిచేసరికి.. ఆప్ క‌న్వీన‌ర్ కేజ్రీవాల్‌కు దిమ్మ‌తిరిగిపోయే ప‌రిణామం ఎదురైంది. ఏడుగురు ఎమ్మెల్యేలు.. రోహిత‌, రాజేష్‌, మ‌ద‌న్‌లాల్‌, న‌రేష్ యాద‌వ్‌, ప‌వ‌న్ శ‌ర్మ‌, బీఎస్ జూన్ స‌హా భావ‌నా గౌర్ త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. వీటిని స్పీక‌ర్ రాం నివాస్‌కు పంపించారు. త‌క్ష‌ణ‌మే వీటిని ఆమోదించాల‌ని అభ్య‌ర్థించారు. అనంత‌రం లేఖ‌లు సంధించారు. అదేస‌మ‌యంలో సోష‌ల్ మీడియాలోనూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. కేజ్రీవాల్‌పై విమ‌ర్శ‌లు చేశారు. కేజ్రీవాల్ అత్యంత విశ్వాస ర‌హితుడ‌ని మ‌ద‌న్ లాల్ పేర్కొన్నారు. ఆయ‌న‌నున‌మ్మి తాము న‌ట్టేట మునిగిపోయామన్నారు.

''కేజ్రీవాల్ అవినీతి ప‌రుడు. ఆయ‌న విశ్వాస ఘాత‌కుడు. ఆయ‌న‌పైనా, ఆయ‌న పార్టీపైనా(ఇప్ప‌టి దాకా ఉన్న‌ది ఈ పార్టీలోనే) మాకు విశ్వాసం లేదు. ప్ర‌జ‌లు కూడా ఈయ‌న‌ను విశ్వ‌సించ‌రాదు'' అని ఎమ్మెల్యేలు త‌మ లేఖ‌ల్లో పేర్కొన‌డం గ‌మ‌నార్హం. కాగా.. ఇదంతా బీజేపీ ఆడిస్తున్న మైండ్ గేమ్ అని ఆప్ నేత‌లు ఎదురు దాడి చేశారు. య‌మునా నదిని క‌లుషితం చేసిన వారు.. ఇప్పుడు ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను క‌లుషితం చేసేందుకు ఈ మైండ్ గేమ్ ఆడుతున్నార‌ని వ్యాఖ్యానించారు. ఎవ‌రు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఆప్ కే ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డ‌తార‌ని పేర్కొన్నారు. ఇక‌, ఈవ్య‌వ‌హారంపై బీజేపీ మౌనంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. కాగా.. ప్ర‌స్తుతం రాజీనామా చేసిన వారు.. బీజేపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేసే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.