Begin typing your search above and press return to search.

దొంగకు బర్త్ డే చేసి పోలీసులకు అప్పగించారు... వైరల్ వీడియో!

అయితే... ఈ సమయంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు ఆ ఇంటి జనాలు. ఇందులో భాగంగా... హ్యాపీ బర్త్ డే చోర్ అని రాయించి, ఓ కేక్ తీసుకొచ్చారు.

By:  Tupaki Desk   |   28 Jan 2025 7:00 AM GMT
దొంగకు బర్త్  డే చేసి పోలీసులకు అప్పగించారు... వైరల్  వీడియో!
X

ఓ ఆసక్తికర పరిణామానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హ ల్ చల్ చేస్తోంది. ఓ అపార్ట్మెంట్ లోని ఇంట్లో "హ్యాపీ బర్త్ డే చోర్" అంటూ బర్త్ డే సాంగ్ వినిపిస్తుంది. ఆ కేకుపైనా ‘హ్యాపీ బర్త్ డే చోర్’ అని రాసి ఉంది. అందరూ చాకుతో కేకును కోస్తే.. ఇక్కడ మాత్రం ఫెన్సింగులు కట్ చేసే కటింగ్ ప్లేర్ తో కేక్ కట్ చేసే ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి.

అవును... తమ ఇంట్లో పట్టుబడిన దొంగకు బర్త్ డే సెలబ్రేషన్స్ చేశారు ఆ అపార్ట్మెంట్ వాసులు! దొంగ పట్టుబడిన రోజు అతడి బర్త్ డే కావడంతో.. కేకు తెప్పించి, అది కట్ చేయించి, ఆ ముక్కలు అతడి నోట్లో పెట్టి చాలా హంగామా చేశారు. ఈ సందర్భంగా.. "హ్యాపీ బర్త్ డే చోర్.." అంటూ బర్త్ డే సాంగ్ కూడా పాడారు. తర్వాత పోలీసులకు ఫోన్ చేశారు.

వివరాళ్లోకి వెళ్తే... ఢిల్లీలోని ఓ అపార్ట్మెంట్ లో దొంగతనానికని తాళంవేసి ఉన్న ఓ ఇంట్లో దూరారు ముగ్గురు యువకులు కం స్నేహితులు! అయితే.. వీరు దొంగతనానికి వెళ్లిన అనంతరం ఇంట్లో వాళ్లు వచ్చేశారు. దీంతో.. ఇద్దరు స్నేహితులు చాకచక్యంగా తప్పించుకుని పారిపోగా.. మరో యువకుడు మాత్రం తప్పించుకునేందుకు ప్రయత్నించి ప్రయతించి దొరికిపోయాడు.

ఈ సమయంలో... ఈ రోజు తన పుట్టిన రోజు అని, అందువల్ల క్షమించి వదిలేయాలని ఆ ఇంటివారిని వేడుకున్నాడు. అయితే... ఈ సమయంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు ఆ ఇంటి జనాలు. ఇందులో భాగంగా... హ్యాపీ బర్త్ డే చోర్ అని రాయించి, ఓ కేక్ తీసుకొచ్చారు. అనంతరం అతడికి బర్త్ డే సాంగ్ పాడుతూ శుభాకాంక్షలు చెప్పారు.

ఈ సందర్భంగా ఆ ఇంట్లోని మహిళలు ఆప్యాయంగా అతడి తలను నిమురుతూ శుభాకాంక్షలు చెబుతూ, ఆశీర్వచనాలు అందజేశారు. ఇక ఇంతేనేమో అని ఆ దొంగ రిలాక్స్ అయ్యేలోపు... పోలీసులకు ఫోన్ చేసి, ఇతడిని వారికి అప్పగించారు. ఈ డిఫరెంట్ ఇష్యూకి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. వాస్తవానికి ఇది 2022కి సంబంధించినదిగా చెబుతున్నారు.

ఇక.. వైరల్ అవుతున్న ఈ వీడియోకి ఆసక్తికర కామెంట్స్ తో స్పందిస్తున్నారు నెటిజన్లు. ఇందులో భాగంగా... "తన జీవితంలో ఈ పుట్టినరోజుని ఎప్పటికీ మరిచిపోలేదు" అని ఒకరంటే.. "వాళ్లంతా బర్త్ డే సాంగ్ పాడటం వేరే లెవెల్" అని ఇంకొకరు అన్నారు. ఇక.. ఈ దెబ్బతో ఆ దొంగ పూర్తిగా మారిపోయే అవకాశాలున్నాయని మరికొంతమంది అభిప్రాయపడ్డారు.