క్యాబ్ లో దారుణం... "నిన్ను రే*ప్ చేస్తే.. మీ అమ్మ వచ్చి కాపాడుతుందా?"
ప్రధానంగా రాత్రి సమయాల్లో ప్రయాణించే మహిళల భద్రతపై నిత్యం చర్చ జరుగుతూనే ఉంటున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 27 Oct 2024 4:07 AM GMTప్రధానంగా రాత్రి సమయాల్లో ప్రయాణించే మహిళల భద్రతపై నిత్యం చర్చ జరుగుతూనే ఉంటున్న సంగతి తెలిసిందే. క్యాబ్ ఎక్కితే డ్రైవర్ ఏమి చేస్తాడో అని, బైక్ పై వెళ్తే రోడ్లపై ఆకతాయిల అల్లర్ల గురించి భయం, మెట్రో అవకాశం ఉండదు... ఈ క్రమంలో జాబ్ ముగించుకుని రాత్రి పూట ఇంటికి వెళ్తున్న ఆడపిల్లలకు గడి గడి గండంలా పరిస్థితి ఉంటుందని చెబుతుంటారు.
కంటికి కనిపించని భయం, గుండెకు మాత్రమే వినిపించే ఆందోళన వారిని ఆ సమయంలో ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటుంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో 10 దాటిన తర్వాత డిన్నర్ ముగించుకుని ఉబర్ ట్యాక్సీలో ఇంటికి బయలుదేరిన ఓ యువతికి ఇలాంటి భయంకరమైన అనుభవమే ఎదురైంది. ఆ విషయాని ఆమె రెడిట్ పోస్ట్ లో వివరించింది.
అవును... దేశ రాజధాని ఢిల్లీలో క్యాబ్ లో ప్రయాణిస్తున్న ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. రాత్రి ఒంటరిగా క్యాబ్ లో వెళ్తుండగా.. ఈ సమయంలో 'నీపై అత్యాచారం చేస్తే.. మీ అమ్మ వచ్చి కాపాడుతుందా?" అని ఆ క్యాబ్ డ్రైవర్ ప్రశ్నిస్తూ బెదిరించాడని 24 ఏళ్ల మహిళ రెడిట్ పోస్ట్ లో పంచుకుంది.
అయితే... ఈ పోస్ట్ కు సంబంధించిన కామెంట్ సెక్షన్ లో అనూహ్యంగా మరికొంతమంది తమ ఇలాంటి అనుభవాలను పంచుకోవడం గమనార్హం. ఈ సమయంలో తన భయానక అనుభవాన్ని పంచుకున్న సదరు మహిళ... తనను అద్దంలో నుంచి క్యాబ్ డ్రైవర్ పదేపదే చూస్తుండటం తాను గమనించినట్లు తెలిపింది.
ఈ సమయంలో... "ఇంత రాత్రి వరకూ ఏమి చేస్తున్నావు"?.. "నువ్వు మగాడివి అయ్యి ఉంటే అస్సలు ట్యాక్సీలో ఎక్కనిచ్చేవాడినే కాదు".. " ఎందుకంటే.. మీరు రేప్ కి గురైతే మమ్మల్ని అంటారు" అని మాట్లాడసాగాడని యువతి పేర్కొంది. ఈ సమయంలో ముందుజాగ్రత్తగా... తన రైడ్ లొకేషన్ ని తల్లికి పంపించింది యువతి.
ఆ విషయం గమనించాడో ఏమో కానీ... "ఐదు నిమిషాల్లో నేను నిన్ను ఏదైనా చేస్తే.. రేప్ చేస్తే.. మీ అమ్మ వచ్చి సహాయం చేస్తుందని అనుకుంటున్నావా?" అని డ్రైవర్ తనతో అన్నాడని ఆ యువతి వెల్లడించింది. అయితే... అదృష్టవశాత్తు ఆమె సేఫ్ గా ఇంటికి చేరుకుందని ఉబర్ కస్ట్ మర్ కేర్ సర్వీసెస్ తెలిపింది.