భారత్ చేతిలో పాకిస్థాన్ ఓటమిపై ఢిల్లీ పోలీస్ శాఖ సూపర్ పంచ్!
అదృష్టవశాత్తూ అవి కేవలం టీవీలను పగలగొట్టిన సౌండ్స్ అనే ఆశిస్తున్నాం’’ అంటూ ఓ ట్వీట్ చేశారు.
By: Tupaki Desk | 24 Feb 2025 6:41 AM GMTచాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ చేతిలో పరాజయం పాలైన పాకిస్థాన్ జట్టుపై ఢిల్లీ పోలీస్ శాఖ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఓటమిని జీర్ణించుకోలేకపోయిన అభిమానులు, టీవీలను ధ్వంసం చేస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు సరదాగా సెటైర్ వేశారు. ‘‘పక్క దేశం నుంచి పెద్ద, పెద్ద శబ్ధాలు వినిపిస్తున్నాయి. అదృష్టవశాత్తూ అవి కేవలం టీవీలను పగలగొట్టిన సౌండ్స్ అనే ఆశిస్తున్నాం’’ అంటూ ఓ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ చూసిన భారత అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు పాక్ క్రికెట్ అభిమానులు టీవీలను పగలగొట్టకుండా వాటికి ఇనుప కంచెలు వేసినట్లుగా ఫన్నీ మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
- సోషల్ మీడియాలో వైరల్
ఈ ట్వీట్ పాకిస్థాన్ క్రికెట్ అభిమానులను హర్ట్ చేసినా, భారత క్రికెట్ ప్రేమికులను మాత్రం తెగ నవ్విస్తోంది. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఓటమిని జీర్ణించుకోలేక టీవీలను ధ్వంసం చేయడం పాక్ అభిమానులకు కొత్తేం కాదు. ప్రతిసారి భారత్ చేతిలో ఓడిన తర్వాత ఇలాంటి వీడియోలు, మీమ్స్ వైరల్ అవుతుంటాయి. అయితే ఈసారి ఢిల్లీ పోలీస్ శాఖ కూడా దీనిపై సెటైర్ వేయడంతో మరింత హైలైట్ అయింది.
- ఓటమిపై పాక్ క్రికెట్ అభిమానుల ఆగ్రహం
ఓటమికి బాధపడే అభిమానులు తమ అసహనాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. కొన్ని వీడియోల్లో, పాక్ అభిమానులు తమ జట్టును తిడుతూ, టీవీలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఈ ఘట్టంపై ఢిల్లీ పోలీస్ శాఖ చేసిన సరదా ట్వీట్ ఇప్పుడు క్రికెట్ ప్రేమికులందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ పంచ్‌పై పాక్ మీడియా ఎలా స్పందిస్తుందో చూడాలి!