సీజ్ ది సెక్రటేరియట్...ఢిల్లీలో ఏమి జరుగుతోంది ?
ఇది చాలా పవర్ ఫుల్ ఆర్డర్ అని అంతా అనుకున్నారు. ఇపుడు చూస్తే సీజ్ ది సెక్రటేరియట్ అంటున్నారు.
By: Tupaki Desk | 8 Feb 2025 9:25 AM GMTసీజ్ ది షిప్ అన్నది ఏపీలో పాపులర్ అయింది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ రిస్క్ చేసి మరీ సముద్రం మధ్యకు వెళ్ళి అక్కడ అక్రమ రవాణా అవుతున్న బియ్యం షిప్ విషయంలో అన్న మాటలు ఇవి. వేసిన ఆర్డర్ ఇది. ఇది చాలా పవర్ ఫుల్ ఆర్డర్ అని అంతా అనుకున్నారు. ఇపుడు చూస్తే సీజ్ ది సెక్రటేరియట్ అంటున్నారు.
ఎక్కడ అలా ఏమా కధ అంటే అంతా ఢిల్లీలోనే అన్నది మ్యాటర్. ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది. వచ్చే ప్రభుత్వం కాషాయం పార్టీది. దాంతో బీజేపీ కొత్త పాలనకు రంగం సిద్ధం అవుతున్న వేళ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీజ్ ద సెక్రటేరియట్ అని ఒక పవర్ ఫుల్ ఆర్డర్ వేశారని అంటున్నారు.
సెక్రటేరియట్ లో ఉన్న ఒక ఫైల్ కానీ రికార్డు కానీ బయటకు వెళ్ళకూడదు అన్నది కూడా ఆదేశంగా ఉంది అని అంటున్నారు. తొందరలో బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పాటు కాబోతోంది. దాంతో బీజేపీ ప్రభుత్వం గత పదేళ్ళలో ఆప్ ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికి తీయాలని అనుకుంటోంది అంటున్నారు.
తాజా ఢిల్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఆప్ అవినీతి మీదనే పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఆప్ హయాంలో ఢిల్లీలో సర్వం అవినీతి మయం అయ్యాయని కూడా విమర్శించింది. దాంతో ఆప్ చేసిన అవినీతిని వెలుగు తీయాలని గట్టిగానే నిర్ణయించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఏ ఒక్క ఫైలూ బయటకు పోరాదని సెక్రటేరియట్ ని సీజ్ చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్డర్ వేశారని అంటున్నారు.
ఇక బీజేపీ కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత అసెంబ్లీలో ఆప్ ప్రభుత్వం మీద కాగ్ నివేదికలను బయటపెడతామని బీజేపీ నేతలు చెబుతున్నారు. అంతే కాదు అరవింద్ కేజ్రీవాల్ అవినీతి మీద సిట్ ని వేస్తామని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ఆప్ ప్రభుత్వం అవినీతి మయం అయిందని దాని మీద పూర్తి స్థాయిలో విచారణలు ఉంటాయని బీజేపీ నేతలు సంకేతాలు ఇస్తున్నారు.
ఇప్పటికే లిక్కర్ స్కాం విషయంలో జైలుకు వెళ్ళి వచ్చిన కేజ్రీవాల్ సహా ఇతర ఆప్ నేతలకు ఇపుడు బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పడ్డాక సరికొత్త విచారణలతో సిద్ధమవుతారా అన్న చర్చ సాగుతోంది. అవినీతి చేస్తే ఎవరైనా విచారణ ఎదుర్కోవాల్సిందే అని అరవింద్ కేజ్రీవాల్ గురువు అయిన అన్నా హజారే అంటున్నారు.
మొత్తానికి 2015 నుంచి 2025 దాకా పదేళ్ళ పాటు అధికారంలో ఉన్న ఆప్ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని బీజేపీ నేతలు అంటున్నారు. మరి వాటి మీద బీజేపీ ప్రభుత్వం మొత్తం లోతైన దర్యాప్తు చేసేందుకు వీలుగానే సెక్రటేరియట్ ని సీజ్ చేశారని అంటున్నారు.