Begin typing your search above and press return to search.

ఆప్ మీద బీజేపీ గెలుపు...ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు నెగ్గేసింది

ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తామని తొందరలోనే చట్టంగా మారుతుందని హోం మంత్రి అమిత్ షా ప్రకటించడం విశేషం

By:  Tupaki Desk   |   8 Aug 2023 3:56 AM GMT
ఆప్ మీద బీజేపీ గెలుపు...ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు నెగ్గేసింది
X

ఢిల్లీలో తమ ప్రత్యర్ధి ఆప్ అధికారం చలాయిస్తోంది. దాంతో బీజేపీ అధికారాలను పరిమితం చేసేందుకు తీసుకొచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు రాజ్యసభలో కూడా నెగ్గేసింది. అనూహ్యమైన మద్దతుతో ఈ బిల్లు పెద్దల సభ ఆమోదం పొందడంతో ఇక ఢిల్లీలో ఆప్ అధికారాలను కత్తెర పడనుంది. ఈ బిల్లుకు రాజ్యసభలో అనుకూలంగా 131 మంది ఎంపీలు ఓటేసారు. వ్యతిరేకంగా 102 మంది ఓటేశారు.

దీంతో బిల్లు నెగ్గినట్లుగా చైర్మన్ ప్రకటించారు. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తామని తొందరలోనే చట్టంగా మారుతుందని హోం మంత్రి అమిత్ షా ప్రకటించడం విశేషం. ఇదిలా ఉంటే ఈ బిల్లుకు బీజేపీ సహా ఎన్డీయే మిత్రులకు తొమ్మిది మంది ఎంపీలు కలిగిన వైసీపీ ఒక్క ఎంపీ కలిగిన టీడీపీ కూడా మద్దతు ఇవ్వడం విశేషం. ఏపీలో రాజకీయ ప్రత్యర్ధులుగా నిత్యం ఘర్షణ పడుతున్న ఈ రెండు పార్టీలు ఢిల్లీలో మాత్రం బీజేపీ బిల్లులకు మద్దతు ఇస్తూ ఒక్కటిగా ఉండడం గమనార్హం.

ఇక పొరుగున ఉన్న ఒడిషాలోని బిజూ జనతాదళ్ కూడా బిల్లుకు మద్దతు ఇవ్వడం మరో విశేషం అనుకుంటే యూపీకి చెందిన బీఎస్పీ కూడా బిల్లుకు మద్దతు ప్రకటించి విపక్షాలకు షాక్ కి గురి చేసింది. ఇదంతా బీజేపీ రాజకీయ చాతుర్యం అనుకోవాల్సిందే. మరో వైపు చూస్తే బీజేపీకి సొంతంగా రాజ్యసభలో బలం వంద కంటే తక్కువే. ఇక మిత్రులు కలుపుకున్నా 121 మెజారిటీకి చాలా ఓట్ల దూరంలో ఉండిపోతుంది.

ఆ కీలక సమయంలో తొమ్మిది మంది వైసీపీ ఎంపీల మద్దతు నిజంగా అమృతప్రాయంగా మారింది అనుకోవాలి. అలాగే మరో తొమ్మిది మంది ఎంపీలు ఉన్న బిజూ జనతాదళ్ మద్దతు కూడా కలసివచ్చింది. దీంతో బిల్లు నెగ్గడానికి అవసరం అయిన 121 ఓట్ల కంటే అదనంగా పది ఓట్లు బీజేపీకి రావడం విశేషం.

ఇదిలా ఉంటే బిల్లు వద్దు అంటూ బీయారెస్ ఓటు వేసింది. కాంగ్రెస్ జేడీఎస్ ఇతర విపక్షాలు అన్నీ ఓటేశాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 2019 ఎన్నికల వేళ ఏపీలో తిరిగి చంద్రబాబుకు అనుకూలంగా ప్రచారం నిర్వహించారు. బాబుకు మంచి దోస్త్. అయినా కానీ టీడీపీ బీజేపీకే మద్దతు ఇచ్చి ఆప్ అధికారాలకు కత్తెర వేసే పనిలో సాయపడింది. ఇదే రాజకీయం అనుకోవాలి.

ఇక వైసీపీ విషయంలో ఆప్ కి ఆశలేమీ లేవు. చర్చలు కూడా జరిపింది లేదు. దాంతో వైసీపీ ఓట్లు కచ్చితంగా బీజేపీ బిల్లుకే అని అంతా భావించారు. మొదట్లో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లికి యాంటీగా మాట్లాడిన బిజూ జనతాదళ్ లాస్ట్ కి బీజేపీకి మద్దతు ఇవ్వడం అనూహ్యమే. తొమ్మిది మంది కలిగిన బిజూ జనతాదళ్ మద్దతు లేకపోతే బిల్లుకు కొంత ఇబ్బంది కలిగేది అని అంటున్నారు. ఇక ఆప్ ఏమి చేయాలన్నా ఢిల్లీలో ఈ చట్టం ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ తో ఏర్పాటు చేసే సూపర్ పవర్ బాడీ నాయకత్వం నిర్ణయంతోనే అని అంటున్నారు.