టొరంటో విమానం బోల్తా... ఎయిర్ లైన్స్ కీలక నిర్ణయం!
డెల్టా ఎయిర్ లైన్స్ విమానం 4819 టొరంటో పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండింగ్ సమయంలో కూలిపోయి బోల్తపడిన ఘటనలో 21 మంది గాయపడిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 22 Feb 2025 5:29 AM GMTకెనడాలోని టొరంటో పియర్ సన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... విమానం ల్యాండ్ అవుతుండగా.. అదుపుతప్పి ఒక్కసారిగా తలకిందులుగా బోల్తాపడింది. ఈ సమయంలో విమానంలో 76 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో 21 మంది గాయపడ్డారు.
దట్టంగా మంచు పేరుకుపోయిన రన్ వేపై విమానం జారుతూ బోల్తాపడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ప్రమాదం కారణంగా విమానంలో మంటలు చెలరేగగా.. ఎమర్జెన్సీ సిబ్బంది అప్రమత్తమై వాటిని అదుపుచేశారు. ఈ సమయంలో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. ప్రయాణికులకు ఆఫర్ ప్రకటించింది!
అవును... డెల్టా ఎయిర్ లైన్స్ విమానం 4819 టొరంటో పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండింగ్ సమయంలో కూలిపోయి బోల్తపడిన ఘటనలో 21 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఎయిర్ లైన్స్ కంపెనీ $30,000 అందిస్తోంది. ఈ సందర్భంగా స్పందించిన డెల్టా... "ఎటువంటి షరతులు లేవు" అని వెళ్లడించింది.
ఈ సమయంలో డెల్టా చెల్లింఫును అంగీకరించే ప్రయాణికులు వెంటనే ఆ డబ్బును అందుకోవాలని.. సంస్థ ప్రతినిధి థామస్ ఎ. డెమోట్రియో తెలిపారు.
కాగా... ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో టొరంటో ఎయిర్ పోర్ట్ వద్ద ఉష్ణోగ్రత మైనస్ 8.6 డిగ్రీలుగా ఉంది. ఇదే సమయంలో గంటకు 51 కిలోమీటర్ల వేగంతో శీతల గాలులు వీస్తున్నాయి. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రన్ వే పై దట్టంగా మంచు పేరుకుపోయింది.