కెనడాలో భారతీయుల పరిస్థితి.. రోడ్ల మీదకు వచ్చారా?
భారత్ నుంచి ఏటా లక్షల సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగార్థులు.. విదేశాలకు వెళ్తున్నారు.
By: Tupaki Desk | 6 Oct 2024 1:36 PM GMTఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్లే భారతీయుల పరిస్థితి ముఖ్యంగా యువత పరిస్థితి దారుణంగా తయారైం ది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అన్ని దేశాల్లోనూ ఉద్యోగాల కొరత వెంటాడుతోం ది. వలసలు పెరుగుతున్న దేశాల్లో అయితే.. ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటోంది. భారత్ నుంచి ఏటా లక్షల సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగార్థులు.. విదేశాలకు వెళ్తున్నారు. అక్కడ చదువుతూనే పార్ట్ టైం జాబ్ చేసుకునే వారు.
ఇలా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ వారి కాళ్లపై వారు ఆధారపడే వారు. కానీ, పరిస్థితులు మారిన నేపథ్యం లో ఇప్పుడు ఉద్యోగాలు చేద్దామన్నా లభించని పరిస్థితి ఏర్పడింది. తాజాగా కెనడాలో భారతీయులు ఇలాంటి దుస్థితినే ఎదుర్కొంటున్నారు. అమెరికా తర్వాత.. భారతీయ విద్యార్థులు క్యూ కడుతున్న మరో దేశం కెనడా. అమెరికాలో ఉన్న కాల్పుల సంస్కృతి కావొచ్చు.. వీసా లభించని దుస్థి తి కావొచ్చు.. భారతీయ విద్యార్థులు కెనడాకు పెరుగుతున్నారు.
అయితే.. ఇలా వెళ్లినవారు పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇది సహజం. అయితే.. ఇప్పుడు కెనడాలోనూ ఈ ఉద్యోగాలకు డిమాండ్ పెరిగిపోయింది. తాజాగా `తందూరి ఫ్లేమ్` అనే రెస్టారెంట్ వెయిటర్లు సహా క్యాషియర్లు, క్లీనర్లు, కీపర్లు వంటి 60 ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చింది. వేతనం ఎంతనేది తెలియదు కానీ.. ఇలా ప్రకటన రాగానే అలా ఈ ఉద్యోగాలను అందిపుచ్చుకునేందుకు వేలాది మంది విద్యార్థులు క్యూ కట్టారు. వీరిలో భారతీయులు కూడా ఉన్నారు.
మొత్తంగా 3 వేల మంది ఈ 60 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం, ఇంటర్వ్యూలకు క్యూ కట్టడం చూస్తే.. అక్కడ ఉద్యోగాలప రిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది. ఇంత చిన్న ఉద్యోగానికి కూడా అంత డిమాండ్ ఏర్పడిందా? అనే చర్చ జరుగుతోంది. మొత్తానికి ఒకప్పుడు విదేశాలంటే.. ఉన్న అభిప్రాయం.. ఇప్పుడు తగ్గుతోంది. ముఖ్యంగా ఉన్న ప్రాంతంలోనే ఏదో ఒకటి వెతుక్కోవడం ఉత్తమమని.. తాజాగా వైరల్ అవుతున్న కెనడా వీడియోలను చూస్తున్న వారు అభిప్రాయపడుతున్నారు.