Begin typing your search above and press return to search.

'జన్మతః పౌరసత్వం' రద్దు... ట్రంప్ కి డెమోక్రాట్ల బిగ్ షాక్!

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ పలు సంచలన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ను జారీ చేశారు.

By:  Tupaki Desk   |   22 Jan 2025 7:58 AM GMT
జన్మతః పౌరసత్వం రద్దు... ట్రంప్  కి డెమోక్రాట్ల బిగ్  షాక్!
X

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ పలు సంచలన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ను జారీ చేశారు. వీటిలో అమెరికా కంటే ఎక్కువగా ప్రపంచ దేశాలు దృష్టి సారించేవే ఉన్నాయని అంటున్నారు. ఈ సమయంలో ట్రంప్ తీసుకున్న జన్మతః పౌరసత్వం రద్దు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై డెమోక్రాట్లు కదం తొక్కారు. న్యాయ పోరాటం షురూ చేశారు.

అవును... అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన మొదటిరోజే డొనాల్డ్ ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో జన్మతః పౌరసత్వం రద్దు ఉత్తర్వ్యు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో ఈ నిర్ణయంపై డెమోక్రటిక్ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై వారు పోరాటానికి దిగారు.

ఇందులో భాగంగా... వారి పాలనలో ఉన్న 22 రాష్ట్రాలు ట్రంప్ తాజా నిర్ణయాన్ని కోర్టుల్లో సవాల్ చేశాయి. ఈ సందర్భంగా ఈ 22 రాష్ట్రాలూ కలిసి రెండు వేర్వేరు వ్యాజ్యాలు దాఖలు చేశాయి. ఈ సందర్భంగా స్పందించిన కాలిఫోర్నియా అటార్నీ జనరల్... ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ నిరుద్ధమని, ఈ ఆర్డర్స్ అమల్లోకి రాకుండా వెంటనే నిలిపివేయాలని కోర్టును కోరారు.

మరోపక్క.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ని రద్దు చేస్తూ అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ (ఏ.సీ.ఎల్.యూ)తో పాటు పలువురు న్యాయవాదులు, పలు సంఘాలు సవాల్ చేస్తూ దావా వేసిన సంగతి తెలిసిందే. దీనిపై తగ్గేదేలే అని వారు చెప్పుకొచ్చారు.

ఈ సమయంలో డెమోక్రాట్లు ఎంటరయ్యారు.. వారి పాలనలో ఉన్న 22 రాష్ట్రాల నుంచి న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీంతో.. ఈ విషయం వైరల్ గా మారింది. ఈ నిర్ణయంపై ట్రంప్ వెర్షన్ ఎలా ఉండబోతుందనేది వేచి చూడాలి.

కాగా... వలస వచ్చినవారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని డొనాల్డ్ ట్రంప్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి సుమారు శతాబ్ధ కాలంగా ఈ చట్టం అమలులో ఉంది. దీని ప్రకారం ఆ దేశ రాజ్యాంగంలో 14వ సవారణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు జన్మతః సంక్రమిస్తుంది. దీనిపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు.