Begin typing your search above and press return to search.

మరోసారి బాబును తగులుకున్న డిప్యూటీ సీఎం.. కీలక వ్యాఖ్యలు!

అటు అసెంబ్లీలో అయినా.. వెలుపల అయనా చంద్రబాబు పేరు చెబితే నారాయణ స్వామి నిప్పులు చెరుగుతారు.

By:  Tupaki Desk   |   26 Dec 2023 12:01 PM GMT
మరోసారి బాబును తగులుకున్న డిప్యూటీ  సీఎం.. కీలక వ్యాఖ్యలు!
X

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి పేరు చెబితే అంతెత్తున లేచే వైసీపీ నేతల్లో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఒకరు. అటు అసెంబ్లీలో అయినా.. వెలుపల అయనా చంద్రబాబు పేరు చెబితే నారాయణ స్వామి నిప్పులు చెరుగుతారు. చంద్రబాబు తనకు చిన్నప్పటినుంచీ తెలుసు అంటూ వ్యాఖ్యానించే ఆయన... అసలు అవినీతి పుట్టిందే బాబుతో అంటూ ఫైరవుతుంటారు.

ఈ క్రమంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో చంద్రబాబు చర్చలు.. అనంతరం టీడీపీ కోసం రాబోయే ఎన్నికల్లో పీకే టీం పనిచేయబోతుందంటూ వస్తున్న కథనాలపై తాజాగా డిప్యుటీ సీఎం నారాయణ స్వామి స్పందించారు. ఇందులో భాగంగా... నిన్న మొన్నటివరకూ డెకాయిట్ అని పిలిచిన ప్రశాంత్ కిశోర్ కాళ్లు పట్టుకోవడానికి కూడా సిద్ధమైపోయాడంటూ దుబ్బయట్టారు.

నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభోత్సవం అనంతరం స్పందించిన నారాయణ స్వామి... ప్రశాంత్ కిశోర్ ని డెకాయిట్ అంటూ అటు చంద్రబాబు, ఇటు లోకేష్ లు గతంలో విమర్శించారంటూ గుర్తుచేశారు. అలా తండ్రీకొడుకులిద్దరూ డెకాయిట్ అని చెప్పిన పీకే కాళ్లు కూడా ఈరోజు పట్టుకుంటున్నారని అన్నారు.

టీడీపీకి సంబంధించిన ఎంపీ ప్రత్యేక ఫ్లైట్ అరేంజ్ చేసి తీసుకొచ్చాడని.. అతని కాళ్లు పట్టుకోవడానికి కూడా చంద్రబాబు సిద్ధపడుతున్నాడంటే... ఎంతలా దిగజారిపోయారో అర్ధమవుతుందని అన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడికి ఒక చరిత్ర ఉందని చెప్పిన నారాయణ స్వామి... అవినీతిని మొట్టమొదటి సారిగా కనిపెట్టిన చక్రవర్తి ఎవరయ్యా అంటే అది చంద్రబాబే అని స్పష్టం చేశారు!

ఇక చంద్రబాబు హయాంలో ఏపీలో ఎలాంటి అభివృద్ధీ జరగలేదని.. ఆయన పాలన అంతా అవినీతిమయమే అని డిప్యూటీ సీఎం దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఏపీలో అమలవుతున్న స్కీం లను అభినందిస్తుంటే... చంద్రబాబుకి దుర్మార్గంగా పత్రికల్లో రాస్తున్న వారికి మాత్రం నచ్చడం లేదని అన్నారు!

అదేవిధంగా... చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఎలాంటి అభివృధి, సంక్షేమం పాలన అందించ లేదని చెప్పిన నారాయణ స్వామి... చంద్రబాబుకు ఎస్సీలను చిన్నచూపు చూసే నైజం మొదటి నుంచి ఉందని ఫైరయ్యారు. నేటికీ దళితులను గౌరవించని వ్యక్తి చంద్రబాబు అని నారాయణ స్వామి మండిపడ్డారు.