జనసేన నుంచే డిప్యూటీ స్పీకర్!
ఈ డిప్యూటీ స్పీకర్ పదవి కోసం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి పేర్లను పవన్ సూచించినట్లు తెలిసింది.
By: Tupaki Desk | 17 Jun 2024 1:25 PM GMTఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి రావడంలో జనసేన కీలక పాత్ర పోషించింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడటంలో పవన్ కల్యాణ్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. అలాగే ఎన్నికల్లో కూటమి విజయం కోసం ఆయన తీవ్రంగా కష్టపడ్డారు. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ గెలిచింది. దీంతో జనసేన కష్టాన్ని, పవన్ కల్యాణ్ శ్రమను గుర్తించిన సీఎం చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. పవన్‌కు డిప్యూటీ సీఎం సహా కీలక శాఖలు అప్పజెప్పారు. ఆ పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్‌కు కూడా కేబినెట్‌లో చోటు కల్పించారు. ఇప్పుడు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకే డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారనే టాక్ వినిపిస్తోంది.
వైసీపీ ఓటమికి జనసేన ప్రధాన కారణమని భావిస్తున్న చంద్రబాబు ఆ పార్టీకి ప్రయారిటీ ఇస్తున్నారు. జనసేనకు మరో పదవిని ఆఫర్ చేయనున్నారని తెలిసింది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకే కేటాయిస్తారనే సమాచారం. ఇప్పటికే ఈ మేరకు జనసేన అగ్రనాయకత్వానికి బాబు సమాచారం అందించారని తెలిసింది.
ఈ డిప్యూటీ స్పీకర్ పదవి కోసం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి పేర్లను పవన్ సూచించినట్లు తెలిసింది. ఈ ఇద్దరిలో ఒకరికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తారనే టాక్ ఉంది. మహిళల కోటాలో లోకం మాధవి వైపే పవన్, బాబు మొగ్గు చూపే అవకాశముందని అంటున్నారు. ఇక స్పీకర్ పదవిని రఘురామ కృష్ణరాజుకు ఇచ్చేందుకు బాబు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.