'చిన్నపిల్లాడి'ని ఇరికించారు: 90 ఏళ్ల వయసులో మాజీ ప్రధాని కన్నీరు!
అయితే.. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ తమపై చేస్తున్న కక్ష సాధింపుగా ఆయన పేర్కొన్నారు.
By: Tupaki Desk | 30 April 2024 9:54 AM GMTఆయన వయసు 92 ఏళ్లు. భారత దేశానికి మాజీ ప్రధాని. కులాసాగా గడిపే వయసులో.. చీకు చింతా లేక.. ఉండాల్సిన సమయంలో ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఇదేం ఖర్మ! అంటూ. మీడియా ముందు గగ్గోలు పెట్టారు. ఆయనే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జేడీఎస్ అధినేత దేవెగౌడ. తాజాగా ఆయన మీడియా ముందుకు వచ్చి.. కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వయసులో తన కుటుంబం ఇంత అప్రతిష్ట పాలవడం చూసి.. ఓర్చుకోలేక పోతున్నానని అన్నారు.
అయితే.. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ తమపై చేస్తున్న కక్ష సాధింపుగా ఆయన పేర్కొన్నారు. ''కాంగ్రెస్ మట్టి కొట్టుకుపోతుంది. మా కుటుంబాన్నిరాచి రంపాన పెట్టాలని అనుకున్నవారు ఎవరూ మిగల్లేదు. ఇప్పుడు నా కుటుంబాన్ని రోడ్డున పడేస్తున్నారు. `చిన్నపిల్లాడు` ఏదో చేశాడని ఆరోపిస్తున్నారు. వీటికి ఆధారాలు లేవు. కానీ, రాజకీయాలు మాత్రమే ఉన్నాయి.'' అని దేవెగౌడ ఘొల్లు మన్నారు. దీంతో మీటింగ్ ఒక్కసారిగా మౌనం అయిపోయింది.
ఏం జరిగింది?
మాజీ ప్రధాని దేవెగౌడ పెద్ద కుమారుడు కుమారుడు రేవణ్ణ పెద్ద కొడుకు.. ప్రజ్వల్(33) హాసన్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆయన ఇక్కడ నుంచే పోటీ చేస్తున్నారు. అయితే.. ఈయనకు సంబంధించిన సెక్స్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 3 వేల మందికి పైగా ప్రభుత్వ , ప్రైవేటు మహిళ ఉద్యోగులతోపాటు.. వారి ఇళ్లలో పనిచేస్తున్న 12 మంది పనిమనుషులపై కూడా.. ప్రజ్వల్ కోరిక తీర్చుకు న్నాడనేది అభియోగం. దీనికి సంబంధించిన వీడియోలు, ఆడియోలను కాంగ్రెస్ పార్టీ బయట పెట్టింది.
దీంతో ప్రజ్వల్.. బ్రిటన్ పారిపోయాడనేది కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. అయితే.. జేడీఎస్ అధినేత దేవెగౌడ మాత్రం తమ కుటుంబంపై ఉన్న అక్కసుతోనే చిన్నపిల్లాడిని పట్టుకుని ఇలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 92 ఏళ్ల వయసులో నన్ను క్షోభపెడుతున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే.. ప్రజ్వల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ.. ఆయన బాబాయి, మాజీ సీఎం కుమార స్వామి ప్రకటన జారీ చేశారు. మరోవైపు.. కేంద్రంలోని బీజేపీ నేతలు.. ప్రజ్వల్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నది కాంగ్రెస్ పార్టీ మరో విమర్శ.ఇంత జరుగుతున్నా.. బీజేపీ మౌనంగా ఉందని ఆరోపిస్తోంది. మొత్తానికి ఈ కథ ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.