అర్థరాత్రి వేళ దేవినేని ఉమ చేస్తున్న పూజలేంటి?
ఎన్నికలు ముంచుకు వస్తున్నాయంటే చాలు ప్రత్యేక పూజలు.. యాగాలు చేయటం మామూలే.
By: Tupaki Desk | 30 Dec 2023 4:07 AM GMTఎన్నికలు ముంచుకు వస్తున్నాయంటే చాలు ప్రత్యేక పూజలు.. యాగాలు చేయటం మామూలే. ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలువురు అభ్యర్థులు పెద్ద ఎత్తున యాగాలు చేయటం తెలిసిందే. అయితే.. రోటీన్ కు భిన్నంగా ఏపీలో మాజీ మంత్రి దేవినేని ఉమ చేస్తున్న పూజలు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం పట్నం మండలం గుంటుపల్లి క్రిష్ణా నది ఒడ్డున ఆయన ఒక ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన స్థలంలో పూజలు చేస్తున్నారు.
ఈ పూజల్ని అత్యంత రహస్యంగా నిర్వహించటం ఒక ఎత్తు అయితే.. ఈ పూజల్ని అర్థరాత్రి వేళలో నిర్వహించటం హాట్ టాపిక్ గా మారింది. పూజలు.. యాగాలు చేసుకోవటం.. చేయించుకోవటం తప్పేంకాదు. కానీ.. ఇలా సీక్రెట్గా ఎందుకు చేయాలన్నది ప్రశ్న. అంతేకాదు.. ఈ పూజల్లో పాల్గొనేందుకు తన సతీమణితో కలిసి.. రహస్యంగా వేరే వారి కారులో వెళ్లటాన్ని ఒక పాయింట్ గా ఎత్తి చూపుతున్నారు.
రహస్య పూజలు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. పూజల తర్వాత గొల్లపూడి సమీపంలో క్రిష్ణానది మధ్యన లంక ప్రదేశంలోఉన్న ఆలయంలో కూడాపూజలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది.ఏమైనా.. ఇలాంటి పూజలు..యాగాలు చేయించినప్పుడు వీలైనంత ఎక్కువ మందిని ఆహ్వానించటం ద్వారా మరింత స్పష్టత వస్తుందని చెబుతున్నారు. అందుకు భిన్నంగా రహస్యంగా పూజలు చేయించటం ద్వారా తప్పుడు ప్రచారాలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.