Begin typing your search above and press return to search.

భారీగా పెరుగుతున్న జీఎస్టీ ఎగవేతలు... షాకింగ్ గా సరికొత్త లెక్కలు!

భారతదేశ ఆర్థిక రంగంలో, వ్యవస్థలో జీఎస్టీ అనేది ఎంత కీలక అంశం అనేది తెలిసిన విషయమే.

By:  Tupaki Desk   |   15 Sep 2024 2:30 PM GMT
భారీగా పెరుగుతున్న జీఎస్టీ ఎగవేతలు... షాకింగ్  గా సరికొత్త లెక్కలు!
X

భారతదేశ ఆర్థిక రంగంలో, వ్యవస్థలో జీఎస్టీ అనేది ఎంత కీలక అంశం అనేది తెలిసిన విషయమే. ఈ అంశంపైనా, అందులోని పలు సంక్లిష్ట విషయాలపైనా నిత్యం ఏదో ఓ మూల అధికారికంగానూ, అనధికారికంగానూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతీ ఆర్థిక సంవత్సరానికీ పెరిగిపోతున్న జీఎస్టీ ఎగవేతల అంశం తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... మొన్నటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నిన్నటి ఆర్థిక సంవత్సరం జీఎస్టీ ఎగవేతలు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రూ.2.01 లక్షల కోట్ల జీఎస్టీని ఎగవేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) గుర్తించింది.

అంటే... 2022-23లో నమోదైన రూ.1.01 లక్షల కోట్లతో పోలిస్తే జీఎస్టీ ఎగవేత విలువ దాదాపు రెట్టింపు అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఆన్ లైన్ గేమింగ్, బ్యాకింగ్, ఆర్థిక, సేవలు, ఇన్సూరెన్స్, ఐరన్, రాగి, తుక్కు వంటి రంగాల్లో ఈ జీఎస్టీ ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇదే క్రమంలో ఆ ఆర్థిక సంవత్సరంలో ఎగవేతల కేసులు 4,872గా ఉన్నాయి.

ఇక తాజాగా 2023-24 ఆర్థిక సంవత్సరం విషయానికొస్తే ఈ ఏడాది నమోదైన ఎగవేత కేసులు 6,084గా ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ఆన్ లైన్ గేమింగ్ రంగంలోనే అత్యధికంగా జీఎస్టీ ఎగవేత నమోదైంది. వీటిలో 78 కేసుల్లో సుమారు రూ.81,875 కోట్ల మేర జీఎస్టీని ఎగ్గొట్టినట్లుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ గుర్తించింది!

ఈ ఆన్ లైన్ గేమింగ్ తర్వాత స్థానంలో... బ్యాకింగ్, ఫైనన్ష్, సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీ.ఎఫ్.ఎస్.ఐ) రెండో స్థానంలో ఉంది. ఈ రంగంలోను కేసుల సంఖ్య 171 గా ఉండగా, ఎగవేసిన జీఎస్టీ విలువ రూ.18,961 కోట్లగా ఉందని డీజీజీఐ గుర్తించింది. ఇక ఇనుము, రాగి, తుక్కు రంగాల్లో కేసుల సంఖ్య 1,976గా ఉండగా ఎగ్గొట్టిన సొమ్ము రూ.16,806 కోట్లుగా ఉంది.

ఈ క్రమంలో ఏటా జీఎస్టీ ఎగవేతల మొత్తం భారీగా పెరుగుతుందని డీజీజీఐ తెలిపింది! ఇందులో భాగంగా... 2017-18లో ఈ ఎగవేతలు రూ.7,879గా ఉండగా.. అది 2018-19కి వచ్చేసరికి రూ.19,319 కోట్లకు పెరిగింది. ఇలా పెరుగుతూ 2019-20లో రూ.21,739.. 2020-21లో రూ.31,908.. 2021-22 లో రూ.50,325 కోట్లుగా పెరిగింది.